Moviesమరో ఊహించని చిక్కుల్లో హేమ.. ఆ ఒక్క ఫోటోతో అడ్డంగా బుక్...

మరో ఊహించని చిక్కుల్లో హేమ.. ఆ ఒక్క ఫోటోతో అడ్డంగా బుక్ అయిపోయిందే..!?

హేమ .. ఈ పేరు ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలా వైరల్ అయిందో ..మారుమ్రోగిపోయిందో ..మనకు తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హేమ ఎన్నో సినిమాల్లో నటించింది . హీరోయిన్ కి తల్లి పాత్రలో ..అక్క పాత్రలో ..వదిన పాత్రలో.. అత్త పాత్రలో పక్కింటి ఆంటీ పాత్రల్లో బాగా నటించి మెప్పించింది హేమ. ముఖ్యంగా కామెడీ కి సంబంధించిన రోల్స్ ఎక్కువగా చేస్తూ ఉంటుంది .

తెరపై ఆమెను చూసి అభినందించిన జనాలు చాలామంది ఉన్నారు. చాలా ట్రెడిషనల్ గా ఉండే హేమ అభిమానులకు బాగా దగ్గరయింది. అయితే రీసెంట్గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో హేమ ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ పార్టీకి హేమ వెళ్లినట్టు అక్కడ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు విచారణలో బయటపడింది. అయితే ఈ కారణంగా ఆమె రిమాండ్ కూడా పంపించారు పోలీసులు. కానీ తాను ఏ తప్పు చేయలేదు అని బెయిల్ మీద బయటకు వచ్చింది హేమ. దీంతో కథ మొత్తం ఇక సుఖాంతం అయిందిలే అనుకుంటూ వచ్చారు ఫాన్స్.

కానీ సడన్గా ఆమెకు సంబంధించిన ఒక ఫోటో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ కలకలం సృష్టిస్తుంది. ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన డిజె సిద్ధార్ధ్ తో కలిసి దిగిన హేమ పిక్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఎలా లీక్ అయింది..? ఎప్పుడు లీక్ అయింది..? ఎవరు లీక్ చేశారో తెలియదు కానీ.. డ్రగ్స్ కేసులు అరెస్టు అయిన డీజే సిద్ధార్ధ్ తో హేమ ఫోటో దిగడం ఇప్పుడు సంచలనంగా మారింది . అసలు అలాంటి వ్యక్తితో ఈ ఫోటో ఎందుకు దిగింది ..? ఆయన జైలు శిక్ష కూడా అనుభవించారు ..డ్రగ్స్ కేసులోని కారణంగా.. మరి హేమకు ఆయనకు సంబంధం ఏంది ..? హేమకు సిద్ధార్ధ్ కు బెంగళూరు పార్టీకి మధ్య ఏదో పెద్ద లింకే ఉంది..? అంటూ చర్చించుకుంటున్నారు . లేకపోతే ఎవరో కావాలనే ఆమెను ఇరికిస్తున్నారా..? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొత్తానికి అంతా బాగుందిలే అనుకున్న టయానికి మరొక ఫోటోతో హేమ ఇరుక్కోవడం ఇప్పుడు సంచలనంగా మారింది..!?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news