Moviesకిర్రాక్ ఆర్పి చేత రోజాను - బన్నీను తిట్టిస్తుంది ఆ వ్యక్తి...

కిర్రాక్ ఆర్పి చేత రోజాను – బన్నీను తిట్టిస్తుంది ఆ వ్యక్తి నేనా.? కోట్లు డబ్బు ఇచ్చాడా..?

కిర్రాక్ ఆర్పి ఒకప్పుడు చాలా సైలెంట్ గా ఉండే కమెడియన్ జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ ద్వారా తన పేరు పాపులారిటీ లోకి వచ్చింది. తనదైన స్టైల్ స్కిట్స్ వేసి పంచెస్ వేస్తూ బాగా ఆకట్టుకున్నాడు .. ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ బాగానే సంపాదించాడు . ఆ తర్వాత సొంతంగా బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు.. దీనంతటికీ కారణం ఆయన వెనుక ఉన్న ఓ పెద్ద వ్యక్తి అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాదు జబర్దస్త్ నుండి బయటకు రావడానికి కూడా ఆ ప్రముఖ వ్యక్తి కారణమంటూ అప్పట్లో బాగా వార్తలు ట్రెండ్ అయ్యాయి . అయితే సడన్గా కిర్రాక్ ఆర్పి ఏపీ రాజకీయాలలో వేలు పెట్టాడు .

మరీ ముఖ్యంగా మంత్రిగా ఓడిపోయిన రోజాపై సంచలన కామెంట్స్ చేశారు . రోజా పై ఎప్పుడు ఎవ్వరు చేయనటువంటి కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాడు .. అంతేనా మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో పైకి వచ్చిన బన్నీ పై కూడా ఆయన మండిపడ్డారు . మీరు వైసిపి క్యాండిడేట్ కు సపోర్ట్ చేయడం అస్సలు బాగోలేదు .. మీ ఫ్యామిలీకి ఏవేవో ఉంటాయి ..ఒక్క రాష్ట్రం నాశనం అవ్వడానికి.. ట్రై చేస్తున్న వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తారు అంటూ కూసింత హైట్ లో మండిపడ్డాడు.

దీనికి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి .. అయితే ఇప్పుడు బన్నీ ఫాన్స్ కిరాక్ ఆర్పి పై మండిపడుతున్నారు.. ఆయన హోటల్స్ పై దాడి చేయబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి క్రమంలోనే కిర్రాక్ ఆర్పీచేత ఓ ప్రముఖ వ్యక్తి ఇలా మాట్లాడిస్తున్నాడు అన్న విషయం గా మారింది ..బ్యాగ్రౌండ్ లో ఆ వ్యక్తి సపోర్ట్ చూసుకునే కిరాక్ ఇలా మాట్లాడుతున్నాడు అని .. లేకపోతే ఇతగాడికి అంత సీన్ లేదు అని ఆయన అండ చూసుకొని ఈ రేంజ్ లో విర్రవీగుతున్నాడు అని.. సోషల్ మీడియాలో ఘాటు ఘాటుగా బన్నీ ఫాన్స్ కిర్రాక్ ఆర్పి పై కామెంట్స్ చేస్తున్నారు .. ఎవరి అండ చూసుకోనైనా సరే అంతలా రెచ్చిపోకూడదు అంటూ సజెషన్స్ కూడా ఇస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news