Movies"ఆ ఒక్క సీన్ చూస్తే ఒక్కొక్కడికి పులుసు కారిపోవాల్సిందే"..పుష్ప2 పై సుకుమార్...

“ఆ ఒక్క సీన్ చూస్తే ఒక్కొక్కడికి పులుసు కారిపోవాల్సిందే”..పుష్ప2 పై సుకుమార్ బ్లాస్టింగ్ అప్డేట్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్ప2కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమానే ఈ పుష్ప2. ఈ సినిమా కోసం సుకుమార్ – అల్లు అర్జున్ ఏ స్థాయిలో కష్టపడుతున్నారో కూడా మనకు తెలుసు . మరీ ముఖ్యంగా ఈ సినిమాతో గ్లోబల్ స్థాయిలో హిట్ కొట్టాలి అంటూ భీష్ముంచుకుని కూర్చున్నారు సుక్కు – బన్నీ . అందుకే ఈ సినిమా కోసం డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతులను కూడా ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు .

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది . ఈ సినిమాలో అన్ని సీన్స్ బాగుంటాయి.. అన్ని సీన్స్ కూడా చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించారు. అయితే క్లైమాక్స్ లో వచ్చే రెండు సీన్స్ మాత్రం బన్నీ ఊర మాస్ లెవెల్ పర్ఫామెన్స్ చూస్తారట. కత్తి ఎత్తుకొని నరికే సీన్స్ లో విజృంభించేస్తాడట. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఊగిపోతున్నారు . చీర కట్టులో బన్నీ విలన్స్ ను నరుకుతూ పోతూ ఉంటే ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ఆ విజువల్స్ కి గూస్బంస్ పక్క అంటున్నారు ఫ్యాన్స్. సుకుమార్ ఈ సీన్స్ కోసం చాలా చాలా కష్టపడ్డారట. ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా నటిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో ఐటెం సాంగ్ తృప్తి దిమ్రి కూడా నటించబోతున్నట్లు ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ కూడా కీలకపాత్రలో కనిపించబోతుంది. సునీల్ – రావు రమేష్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించి మెప్పించబోతున్నారు. మొత్తానికి సుకుమార్ ఓ రేంజ్ లో కుమ్మి పడేయబోతున్నాడనమాట. చూద్దాం ఆగస్ట్ 15 వ తేది ఏం జరగబోతుందో..??

ఎన్నికల్లో టిడిపికి సపోర్ట్ చేయని తారక్ గెలిచాక ఈ రేంజ్ లో పొగిడేయడం వెనక ఆయన హస్తం ఉందా

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news