Moviesఈ హీరోయిన్స్ పై ఆ డైరెక్టర్స్ చెయ్యి పడితే రచ్చ రంబోలానేనా..?...

ఈ హీరోయిన్స్ పై ఆ డైరెక్టర్స్ చెయ్యి పడితే రచ్చ రంబోలానేనా..? దబిడి దిబిడి అవ్వాల్సిందే..!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు డైరెక్టర్స్ . కొంతమంది హీరోలు కూడా అదే విధంగా ఫాలో అవుతూ ఉంటారు . పలానా రోజునే సినిమా పూజా కార్యక్రమాలు చేయాలి అని కొంతమంది హీరోలు ఫిక్స్ అయితారు . మరి కొంతమంది తమ సినిమా పూజా కార్యక్రమాలకి వాళ్లు అడుగుపెడితే ఆ సినిమా పెద్దగా సక్సెస్ సాధించదు అన్న భయంతో అలాంటి వాటికి అసలు హాజరు కూడా అవ్వరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ..ఒక్కొక్కరికి నమ్మకం ఉంటుంది . అయితే తాజాగా సినిమా ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్స్ కి కొందరు హీరోయిన్స్ తో నటిస్తే హిట్ పడుతుంది అన్న నమ్మకాలు ఎక్కువగా పెరిగిపోయాయి . వాళ్ల గురించి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

రాజమౌళి: టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రాజమౌళికి లక్కీ హీరోయిన్ అంటే మాత్రం అనుష్క అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ కాంబోలో వచ్చిన బాహుబలి – బాహుబలి 2 – విక్రమార్కుడు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బిగ్ బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. వీళ్లు కేవలం హీరోయిన్ డైరెక్టర్స్ గానే కాదు మంచి ఫ్రెండ్స్ గా కూడా ఉంటారు.

అనిల్ రావిపూడి: అనిల్ రావిపూడి కి ఆల్మోస్ట్ అందరూ లక్కీ హీరోయిన్స్.. మెయిన్ లక్కీ హీరోయిన్ అంటే మాత్రం మెహ్రిన్ అని చెప్పాలి. వీళ్ళ కాంబోలో వచ్చిన రాజా ది గ్రేట్ ఎఫ్2,ఎఫ్ 3..సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి.

హరీష్ శంకర్: ఈ డైరెక్టర్ కి లక్కీ హీరోయిన్ అంటే మాత్రం పూజా హెగ్డే . అందరికీ ఫ్లాప్స్ ఇచ్చిన పూజ హెగ్డే హరీష్ కి మాత్రం బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది . గద్దల కొండ గణేష్ – డీజే సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

త్రివిక్రమ్: మాటల మాంత్రికుడిగా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. చాలా మంది హీరోయిన్స్ కి త్రివిక్రమ్ లైఫ్ ఇచ్చాడు .అయితే అదే మూమెంట్లో ఆయన సినిమాలో నటించే సెకండ్ హీరోయిన్స్ కి లైఫ్ నాశనం కూడా చేశాడు . మరి ముఖ్యంగా త్రివిక్రమ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇలియానా – సమంత . వీళ్లిద్దరికి ఎన్ని హిట్స్ ఇచ్చాడో.. అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు . సమంతతో ఏకంగా సన్ ఆఫ్ సత్యమూర్తి ..అ ఆ.. అత్తారింటికి దారేది సినిమాలను తెరకెక్కించి హాట్రిక్ హిట్స్ అందుకున్నాడు .

శేఖర్ కమ్ముల: సాయి పల్లవి అంటే శేఖర్ కమ్ములకు లక్కీ హీరోయిన్ అని చెప్పొచ్చు. వీరి కాంబోలో వచ్చిన ఫిదా సినిమా సూపర్ హిట్ అయింది. అలాగే లవ్ స్టోరీ సినిమా ఏకంగా 100 కోట్లు దాటేసింది. ఈ డైరెక్టర్ చెయ్యి ఒక్కసారి ఆ హీరోయిన్స్ పై పడితే మాత్రం సినిమా రికార్డులు బద్దలు అవ్వాల్సిందే ..అలాంటి ఒక క్రేజీ చరిత్ర వీళ్ళకి ఉంది అన్న విషయం ఇప్పుడు హైలైట్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news