Moviesఆ ఒక్క పని చేస్తే బన్నీ మళ్లీ తన క్రేజ్ ని...

ఆ ఒక్క పని చేస్తే బన్నీ మళ్లీ తన క్రేజ్ ని కాపాడుకోగలడా ..? తెలిసీనా కూడా ఎందుకు చేయడం లేదు..?

అల్లు అర్జున్ .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ హ్యూజ్ హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొంటున్న పేరు . తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ తెలిసి తెలియక తనంతో చేసిన ఒక పని ఆయన కెరియర్ని చిక్కుల్లో పడేసేలా చేసింది . వైసిపి కాండిడేట్ శిల్పా రవికి సపోర్ట్ చేయడం అల్లు అర్జున్ కు భారీ నెగిటివ్ పాయింట్స్ క్రియేట్ చేసి పెట్టింది. మెగా ఫ్యాన్స్ సైతం అల్లు అర్జున్ పై మండిపడుతున్నాడు అంటే కారణం అదే.. మెగా ఫ్యామిలీ ఏకంగా అల్లు ఫ్యామిలీని దూరం పెట్టేసింది అన్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.

మెగాస్టార్ పవన్ కి ఇచ్చిన గ్రాండ్ వెల్కమ్ లో అల్లు అర్జున్ ఫ్యామిలీ మిస్ అయింది . దీంతో అల్లు అర్జున్ ని మెగా ఫ్యామిలీ దూరం పెట్టేసింది అన్న వార్తలకు మరింత అజ్యం పోసినట్టయింది . కాగా రీసెంట్గా అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . అల్లు అర్జున్ మళ్లీ తన పునర్ వైభవం అందుకోవాలి అన్న.. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అట్రాక్ట్ అవ్వాలి అన్నా మెగాస్టార్ చిరంజీవిని .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కలిసి ఫొటోస్ దిగడం ..

పలు సెలబ్రేషన్స్ లో భాగం కావడం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అల్లు అర్జున్ కూడా నాకెందుకులే ..? నాకు వాళ్ళతో పని ఏంటి లే ..? అనుకుంటే అది కచ్చితంగా బన్నీకి నెగిటివ్గా మారుతుంది అని చెప్తున్నారు . మరి ఇన్ని తెలిసిన బన్నీ ఎందుకు మెగా ఫ్యామిలీని కలపలేక పోతున్నారు..? పవన్ కళ్యాణ్ గెలిచి వారం దాటిపోతుంది .. అయినా సరే ఎందుకు ఇంకా పవన్ కళ్యాణ్ మీట్ అవడం లేదు .. అల్లు అరవింద్ కూడా సైలెంట్ అయిపోయాడు..? అసలు ఏం జరుగుతుంది..? అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news