Moviesఅద్గది రౌడి హీరో ఈగో టచ్ చేస్తే అలానే ఉంటాది.. ట్రోలర్స్...

అద్గది రౌడి హీరో ఈగో టచ్ చేస్తే అలానే ఉంటాది.. ట్రోలర్స్ కి విజయ్ దేవరకొండ ఊర నాటు మాస్ రిప్లై..!

మనకు తెలిసిందే.. కల్కి సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ పై ఎలాంటి ట్రోలింగ్ జరిగింది అనేది . నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమాలో అర్జునుడి గెటప్ లో కనిపించాడు విజయ్ దేవరకొండ . ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్లాప్ తర్వాత ఆయన కనిపించిన మూవీ ఇదే. అయితే ఈ మూవీలో ఆయన లుక్స్ పై హ్యూజ్ ట్రోలింగ్ జరిగాయి . అసలు అర్జునుడిలా ఉన్నాడా ..? సినిమాకి ఆయన క్యారెక్టర్ నెగటివ్గా మారింది ..?

వరస్ట్ అంటూ పలువురు ఆయనను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు . అయితే ట్రోలర్స్ కు బాగా గట్టిగానే ఇష్టపడేస్తూ వచ్చారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. రీసెంట్గా ట్రోలర్ లకి ఊర నాటు మాస్ రిప్లై ఇచ్చాడు. విజయ్ దేవరకొండను అర్జునుడి పాత్రలో చూసి కామెంట్స్ చేసిన వారికి స్ట్రాంగ్ గా రిప్లై గా “అదే లుక్” ని తన సోషల్ మీడియా అకౌంట్స్ ను డిపి గా పెట్టుకున్నాడు . మీరు ఎన్ని ట్రోల్స్ చేసుకున్న నాకు నో ప్రాబ్లం అన్నట్టుగా విజయ్ తన డిపి చేంజ్ చేయడం హైలైట్ గా మారింది .

రౌడీ హీరో అంటే అంతే ..మిగతా వారిని పట్టించుకోడు.. తన పని తాను చేసుకుంటాడు ..అందుకే విజయ్ దేవరకొండ అంత పెద్ద స్టార్ అయ్యాడు అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.
రిజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ పై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది . ఆయన మంచి చేసిన మంచి చేయకపోయినా ఆయన పేరుని పదేపదే ట్రోలింగ్కి గురి చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news