Movies"ప్రభాస్ కారణంగా చాలా నష్టపోయా".. స్టార్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

“ప్రభాస్ కారణంగా చాలా నష్టపోయా”.. స్టార్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

ప్రభాస్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద స్టార్ హీరో ..పాన్ ఇండియా హీరో అయిన తర్వాత ప్రభాస్ రేంజ్ ఏ విధంగా మారిపోయిందో మనందరికీ తెలిసిందే . ప్రభాస్ తో సినిమాలో నటించాలి అని ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని .. ప్రతి ఒక్క హీరోయిన్ కోరుకుంటుంది. అయితే కొన్ని కారణాలు చేత కొన్ని ఆఫర్స్ కొంతమంది హీరోయిన్స్ కి దక్కకపోవచ్చు . రీసెంట్ గా సోషల్ మీడియాలో హీరోయిన్ నిత్యామీనన్ పేరు మారు మ్రోగిపోతుంది .

పేరుకి మలయాళ బ్యూటీ నే అయినా తెలుగులో పలు సినిమాలో నటించి క్రేజీ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది . మరీ ముఖ్యంగా నిత్యామీనన్ నటించిన సినిమాలు చాలా న్యాచురల్ గా ఉంటాయి అన్న పేరు ఎప్పటినుంచో వినపడుతుంది . అయితే నిత్యామీనన్ ప్రభాస్ కారణంగా చాలా చాలా టార్చర్ ఫేస్ చేసింది అట . ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు రావడం గమనార్హం. నిత్యామీనన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సినిమా అలా మొదలైంది.

నందిని రెడ్డి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ఈ సినిమాలో ఆమె హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్ టైంలో ఆమెకు ప్రభాస్ గురించి ప్రశ్న ఎదురయింది . అయితే ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అంటూ ఓపెన్ గా చెప్పేసింది . దీంతో సోషల్ మీడియాలో అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అమ్మడును విపరీతంగా ట్రోల్ చేశారు. ఆమెను చాలా చాలా ఇబ్బందులకు గురి చేశారు . ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్పుకు వస్తూ ..”అప్పుడు నా ఏజ్ చాలా చిన్నది ..నాకు తెలుగు ఇండస్ట్రీ గురించి అసలు తెలియదు .. నిజంగానే నాకు ప్రభాస్ అంటే ఎవరో తెలియదు ..అయితే నన్ను ఎందుకు అంతలా ప్రభాస్ ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టారు “అంటూ చాలా బాధపడ్డాను.. చాలా చిత్రహింసలకు గురయ్యాను ..మనోవేదనకు గురయ్యాను ..అంటూ చెప్పుకు వచ్చింది . మరొకసారి నిత్యామీనన్ మాటలు బాగా వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news