Movies"ఎందుకో తెలియదు ఆ హీరోతో అలా చేయాలని ఉంది".. అనుష్క నేవర్...

“ఎందుకో తెలియదు ఆ హీరోతో అలా చేయాలని ఉంది”.. అనుష్క నేవర్ ఎవర్ బోల్డ్ స్టేట్మెంట్ విన్నారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ మాత్రం చాలా చాలా డిఫరెంట్ అనే చెప్పాలి . టాలీవుడ్ జేజమ్మగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . ఎన్నో హిట్ సినిమాలలో నటించింది . ఫుల్ క్రేజ్ దక్కించుకుంది . కాగా ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలకు తెలుగులో పెట్టింది పేరు అనుష్క . మరి ముఖ్యంగా అరుంధతి.. సైజ్ జీరో.. వేదం ..భాగమతి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి అభిమానులను ఫిదా చేసింది.

కాగా ఆమె లాస్ట్ గా నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి . ఈ సినిమాతో ఆమె ఎలాంటి టాక్ అందుకుందో కూడా మనకు తెలిసిందే. కాగా రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది . ఆ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట పెద్ద వైరల్ గా మారాయి . ఎప్పుడు కూడా చాలా చాలా సరదాగా చాలా జోవియల్ గా లిమిట్స్ లో మాట్లాడే అనుష్క ఈసారి కూడా సరదాగానే మాట్లాడింది. కాకపోతే ఆమె మాట్లాడిన మాటలు జనాలు తప్పుగా తీసుకుంటున్నారు .

యాంకర్ ఆమెను ప్రశ్నిస్తూ..” మీకు ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఇద్దరిలో ఎవరితో హీరోయిన్గా ఛాన్స్ వస్తే చేస్తారు ..? ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అంటూ ప్రశ్నిస్తుంది . దీంతో అనుష్క తడబడకుండా ఎన్టీఆర్ తో చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఎన్టీఆర్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఒక్కసారైనా ఆయనతో రొమాంటిక్ సీన్స్ .. లవ్ .. యాక్షన్ సీన్స్ లో నటించాలని ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు రాంచరణ్ తో నటించే సినిమా అవకాశాలు వచ్చాయి కానీ ఆయన పక్కన నేను సిస్టర్ లా ఉంటాను అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది అందుకే ఆయన సినిమాలను యాక్సెప్ట్ చేయలేకపోయాను అంటూ చెప్పుకొచ్చింది. కాగా దాదాపు నాలుగు సినిమాల్లో రాంచరణ్ తో నటించే అవకాశం వచ్చిన అనుష్క మిస్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news