Moviesసోషల్ మీడియాలో హ్యూజ్ అసభ్యకరంగా ట్రోలింగ్.. సంచలన నిర్ణయం తీసుకున్న అల్లు...

సోషల్ మీడియాలో హ్యూజ్ అసభ్యకరంగా ట్రోలింగ్.. సంచలన నిర్ణయం తీసుకున్న అల్లు అర్జున్..!?

ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ ని ఎలా ట్రోల్ చేస్తున్నారో జనాలు మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు అన్ని మూసుకొని ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ఏరా .. రారా.. పోరా.. అన్న రేంజ్ లో మాట్లాడుతున్నారు . అఫ్కోర్స్ అల్లు అర్జున్ చేసింది తప్పా..? ఒప్పా..? పక్కన పెడితే ఆయన డెసిషన్ ఆయన తీసుకున్నాడు. ఆయన ఫ్రెండ్ కి ఆయన సపోర్ట్ చేయాలి అనుకున్నాడు. ఇందులో పెద్ద తప్పేం కాదు.. దానివల్ల ఎందుకు మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు ..?

పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకుండా వైసిపి కాండిడేట్ కు సపోర్ట్ చేయలేదు..కదా..? పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూనే తన ఫ్రెండ్ కి కూడా సపోర్ట్ చేశాడు ..ఇందులో అంత పెద్ద రాద్ధాంతం చేయాల్సిన విషయం ఏముంది ..?అంటూ బన్నీ ఫాన్స్ మండిపడుతున్నారు. అయితే ఓ కమెడియన్ బీభత్సంగా అల్లు అర్జున్ పై రెచ్చిపోవడం మనం చూస్తున్నాం . రీసెంట్ గా సోషల్ మీడియాలో బన్నీ ను మరింత స్థాయిలో ట్రోల్ చేస్తూ అల్లు స్నేహారెడ్డి ..అల్లు అర్హ.. అల్లు అయాన్లు కూడా టార్గెట్ చేశారు.

తన వరకు వచ్చిన సైలెంట్ గా ఉండే బన్నీ తన ఫ్యామిలీ జోలికి వస్తే అస్సలు సైలెంట్ గా ఉండడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ పై సైబర్ క్రైమ్ ని ఆశ్రయించి పోలీస్ కేసు నమోదు చేయాలి అంటూ ఫిక్స్ అయ్యాడట అల్లు అర్జున్. అల్లు కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు అల్లు అర్జున్ తనను తన ఫ్యామిలీను ట్రోల్ చేస్తూ అవసరం లేని రాద్ధాంతంలో ఇరికిస్తూ తన పేరుని అసభ్యకరంగా బూతు పదాజాలంతో ట్రోల్ చేస్తున్న వారిపై సివియర్ యాక్షన్ తీసుకునే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్నారట . దీనిపై అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా పాజిటివ్ గానే స్పందించిందట .సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news