Moviesప్రభాస్ తర్వాత "కల్కి" సినిమాలో హైలెట్ కాబోతున్న ఆ క్యారెక్టర్ ఎవరిదో...

ప్రభాస్ తర్వాత “కల్కి” సినిమాలో హైలెట్ కాబోతున్న ఆ క్యారెక్టర్ ఎవరిదో తెలుసా..? నాగ్ అశ్వీన్ ఏం ప్లానింగ్ రా బాబు..!

కల్కి.. కల్కి.. కల్కి.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా నటించిన ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమానే ఈ కల్కి . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరి కొద్ది గంటల్లోనే రిలీజ్ కాబోతుంది . ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ లో జూన్ 27వ తేదీ రిలీజ్ కాబోతుంది .

కాగా ఇలాంటి క్రమంలోనే సినిమాకి సంబంధించిన కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . మరీ ముఖ్యంగా ప్రభాస్ నటిస్తున్న ఈ కల్కి సినిమాలో హైలెట్ క్యారెక్టర్ గా ఉండబోయేది ప్రభాస్ దే అన్న విషయం అందరికీ తెలిసిన .. ప్రభాస్ తర్వాత ఈ సినిమాలో ఆ రేంజ్ లో హిట్ అందుకోబోయే క్యారెక్టర్ మాత్రం దీపికా పదుకొనేది అంటూ తెలుస్తుంది. అఫ్కోర్స్ సినిమాలో స్టార్స్ కమల్ హాసన్ – అమితాబచ్చన్ – విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ దీపికా పదుకొనే క్యారెక్టర్ ఈ సినిమాకి హైలైట్ గా మారిపోతుందట.

అసలు ఈ సినిమాకి మొత్తం కర్త – కర్మ – క్రియ అంతా కూడా దీపికా పదుకొనే అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ క్యారెక్టర్ ని ఎంత హైలైట్ చేయబోతున్నారో బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపికా పదుకొనే క్యారెక్టర్ ని అంత హైలెట్ చేయబోతున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు బాగా బాగా ట్రెండ్ అవుతుంది . చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో మొదటి రోజు..??

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news