Movies"ఎర్ర తోలు ఉండే ప్రతి హీరోయిన్ తో హీరోలకు అదే పని".....

“ఎర్ర తోలు ఉండే ప్రతి హీరోయిన్ తో హీరోలకు అదే పని”.. మోహన్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్న క్రేజ్ గురించి.. పబ్లిసిటీ గురించి పాపులారిటీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తనదైన స్టైల్ లో ఎన్నో ఎన్నో సినిమాల్లో నటించి సినిమా ఇండస్ట్రీని ఓ స్థాయిలో నిలబెట్టాడు . మరీ ముఖ్యంగా మోహన్ బాబు అనగానే అందరికీ గుర్తొచ్చేది క్రమశిక్షణ.. డేడికేషన్.. ముక్కుసూటితనం. ఏ విషయమైనా ఎలాంటి విషయమైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తాడు ..మాట్లాడేస్తాడు .. అవతల ఉన్నది ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే మోహన్ బాబు అనుకున్నది మాట్లాడడం మాత్రం మానడు. ఆ విషయం అందరికీ తెలిసిందే .

పలు సందర్భాలలో కూడా అది ప్రూవ్ అయింది . కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోహన్ బాబు చేసిన కామెంట్స్ అప్పట్లో ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. ప్రెసెంట్ ఆ వీడియో మరొకసారి నెట్టింట వైరల్ గా మారింది. కాగా మోహన్ బాబు ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతాడు అని తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో కొన్ని పరిస్థితులపై స్పందించిన మోహన్ బాబు స్ట్రైట్ గా ఉన్న విషయాన్ని చెప్పేశారు. ఇండస్ట్రీ బ్రష్టు పట్టుకోవడానికి కారణం సెక్రటరీలు మేనేజర్లు అంటూ చెప్పుకొచ్చాడు .

ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు అని అంటూ ఉంటారు .. ఇక్కడ వారే ఇండస్ట్రీని నాశనం చేస్తూ ఉంటే ఎవరైనా ఏం చేయగలం ..?? అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు . మరీ ముఖ్యంగా నార్త్ హీరోయిన్స్ అయితే చాలు ఏగేసుకొని ఓకే చేసేస్తారని ..వాళ్ళు షూటింగ్ కి ఆలస్యంగా వచ్చిన ఎందుకు వచ్చావు అని ప్రశ్నించే దమ్ము ఒక్కరికి లేదు అని.. ఎర్రతోలు వేసుకొని రాగానే హాయ్ చెప్తూ హగ్గిస్తూ వాళ్లతో మాటలు కలపడం తప్పిస్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వరు అని ..

నార్త్ హీరోయిన్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం నాకు నచ్చదు అంటూ చెప్పుకొచ్చారు. ఎవరైనా హీరోయిన్ మోహన్ బాబుతో నటిస్తుంది అని చెప్పగానే చాలామంది హీరోలు చులకనగా మాట్లాడుతారు అని ..ఆ హీరోయిన్ల పేర్లు కూడా నాకు తెలుసు అని చెప్పుకొచ్చారు . మనవాళ్లంతా నార్త్ హీరోయిన్లని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు . ఇండస్ట్రీలో చాలామంది సెక్రటరీలు మేనేజర్లు బ్రోకర్ల గా బిహేవ్ చేస్తారు అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు . మేనేజర్లు ఉన్నవి లేనివి కల్పించి చెప్పి హీరోయిన్ ని కన్ఫ్యూజ్ చేసి మాట్లాడుతూ ఉంటారు అని మోహన్ బాబు చెప్పుకు రావడం సంచలనంగా మారింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news