Moviesపుష్ప2 సినిమా వాయిదా పడడానికి కర్త-కర్మ-క్రియ అన్ని ఆయనే.. మొత్తం కూడా...

పుష్ప2 సినిమా వాయిదా పడడానికి కర్త-కర్మ-క్రియ అన్ని ఆయనే.. మొత్తం కూడా ఆ పెద్దమనిషే సర్వ నాశనం చేశాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. బన్నీకి ఇష్టం లేకుండానే పుష్ప2 సినిమాను వాయిదా వేయించారా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . మనకు తెలిసిందే బన్నీ అంత పిరికోడు కాదు .. చాలా మొండోడు .. అనుకున్నది సాధించే టైప్.. ఆ విషయం అందరికీ తెలిసిందే. డాడీ సినిమాలో ఒక చిన్న రోల్లో కనిపించి ఆ తర్వాత గంగోత్రి సినిమాతో హీరోగా మారి .. ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కిందకి పడుతూ పైకి లేస్తూ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కించుకున్నారు .

అలాంటి బన్నీ కేవలం కొందరు జనాలు టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు అని తన సినిమాని వాయిదా వేసుకుంటాడా..? జస్ట్ నాన్సెన్స్.. అలాంటిది ఏదీ లేదు అంటూ బన్నీ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . బన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న పుష్ప2 సినిమా డిసెంబర్ 6 వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . దీంతో మెగా ఫాన్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే అంతే సీన్.. బొమ్మ రివర్స్ అయిపోద్ది అంటున్నారు .

దీనికి బన్నీ ఫాన్స్ కూడా ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు . బన్నీ ఇష్టం లేకుండానే సినిమాని వాయిదా వేయించుకున్నాడు అని.. మైత్రి మూవీ మేకర్స్ వారు సుకుమార్ ఈ సినిమాను కావాలని బడ్జెట్ ప్రాబ్లమ్స్ కారణంగా రేపు ఇష్యూస్ ఎదురుకోకూడదు అన్న భయంతో బన్నీకి ఇష్టం లేకుండా ఈ సినిమాను వాయిదా వేయించారు అని బన్ని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అసలు ఈ సినిమా వాయిదా వేయాలి అన్న ప్రతిపాదన తీసుకొచ్చిన మొదటి వ్యక్తి కూడా సుకుమారే అని, సినిమా వాయిదా పడడానికి కర్త – కర్మ – క్రియ మొత్తం సుకుమార్ అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ హాట్ హాట్ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news