Movies"ఆయన ఓ మూర్ఖుడు..నా భార్యను అలా పిలుస్తాడు"..చిరంజీవి సెసేషనల్ కామెంట్స్ వైరల్..!!

“ఆయన ఓ మూర్ఖుడు..నా భార్యను అలా పిలుస్తాడు”..చిరంజీవి సెసేషనల్ కామెంట్స్ వైరల్..!!

ఎంతటి ప్రాణ స్నేహితులైన వాళ్ళ మధ్య గొడవలు రావడం కామన్.. అలాగే చిరంజీవి – యండమూరి మధ్య గొడవలు వచ్చాయి. ఓ కళాశాల ఈవెంట్లో పాల్గొన్న యండమూరి .. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు . అప్పట్లో ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాయి . “చరణ్ ను హీరోగా నిలబెట్టేందుకు సురేఖ నానా తంటాలు పడింది అని .. డాన్సులు నేర్పించేది అని చాలా కష్టపడింది అని.. కానీ ఆ అబ్బాయి దవడ సరిగ్గా ఉండేది కాదు అని .. ఆ తర్వాత రోజుల్లో అది బాగు చేయించారు అని యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు “.

అదే కళాశాల ఈవెంట్లో మరో ఎనిమిదేళ్ల కుర్రాడుని ఓ రేంజ్ లో పొగిడేసాడు . ఆయన మరెవరో కాదు దేవి శ్రీ ప్రసాద్ . అబ్బని తీయ్యని దెబ్బ పాటను శివరంజని రాగమని చెప్పాడని.. అది ఆయన టాలెంట్ అని యండమూరి ఓ రేంజ్ లో పొగిడేసారు . దేవి శ్రీ ప్రసాద్ స్వశక్తితో పైకి వచ్చారు అని ప్రశంసించారు . అప్పట్లో మెగా ఫాన్స్ ని ఈ కామెంట్స్ బాగా హర్ట్ చేశాయి.. సరిగ్గా అదే మూమెంట్లో చిరంజీవి రీ ఎంట్రీ ఖైదీ నెంబర్ 150 వేదికపై నాగబాబు ఘాటుగా రియాక్ట్ అయ్యాడు.

“కనిపిస్తే కాళ్లకు దండం పెడతాను .. వాడు మూర్ఖుడు అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు”. అయితే ఆ తర్వాత చిరంజీవి సైతం నాగబాబు మాటలను వత్తాస పలుకుతూ మాట్లాడాడు . దీంతో యండమూరి వీరేంద్రనాథ్ స్పందించారు . చిరంజీవి నాకు ఎంత దగ్గర వ్యక్తి నో.. దేవి శ్రీ ప్రసాద్ తండ్రి కూడా అంతే దగ్గరగా ఉండే వ్యక్తి అని .. అప్పుడెప్పుడో మాట్లాడిన మాటలను ఇప్పుడు తవ్విలోడి బయటకు తీయడం సమంజసం కాదు అని చెప్పుకు వచ్చారు. అయితే చిరంజీవి కూడా ఫైర్ అయ్యారు..” తన భార్యను సభా మర్యాద లేకుండా ఏక వచనంతో సంబోధించడం కరెక్ట్ కాదు అంటూ యండమూరి వీరేంద్రనాథ్ ఫైర్ అయ్యారు”. అయితే ఆ తర్వాతి రోజుల్లో ఈ వివాదం సర్దుమణగడమే కాదు చిరంజీవి తన ఆటోబయోగ్రఫీ రాసే బాధ్యతలు కూడా యండమూరి కి అప్పగించారు. అయితే చరణ్ పై మాత్రం ఆయన చేసిన కామెంట్స్ ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ కు మండిస్తూనే ఉంటాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news