Moviesకోలీవుడ్ లో ఆయన ..టాలీవుడ్ లో ఈయన .. పూజ హెగ్డే...

కోలీవుడ్ లో ఆయన ..టాలీవుడ్ లో ఈయన .. పూజ హెగ్డే కు లక్కీ హీరోలుగా మారిపోయిన ఆ ఇద్దరు ఎవరో తెలుసా..?

టైం.. ఎప్పుడు ఎవరికి ఎలా మారిపోతుందో మారుతుందో ఎవ్వరం గెస్ చేయలేము..అది 100% నిజం.. అది ఎవరికైనా సరే .. అదే విషయాన్ని పక్కాగా నమ్ముతుంది .. పూజా హెగ్డే . నిన్న మొన్నటి వరకు ఖాతాలో ఒక్కటంటే ఒక్క సినిమా లేదు .. సోషల్ మీడియాలో చూస్తే హ్యూజ్ ట్రోలింగ్ .. నమ్మిన డైరెక్టర్స్ ముంచేశారు ..క్రేజ్ కోసం వాడుకున్న స్టార్స్ దూరం పెట్టేశారు .. మింగలేని కక్కలేని పొజిషన్ నుంచి ఇప్పుడు మళ్ళీ బయటపడింది పూజ హెగ్డే .

ఒకటి కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు బడా స్టార్ హీరోల సినిమాలలో అవకాశం దక్కించుకుంది . దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింత బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. దానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. అంతేకాదు నాగచైతన్య నెక్స్ట్ సినిమాలోని హీరోయిన్గా సెలెక్ట్ అయింది .

దీనికి సంబంధించి త్వరలోనే అఫీషియల్ ప్రకటన రాబోతుంది . విరుపాక్ష డైరెక్టర్ తో నాగచైతన్య ఒక సినిమాకి కమిట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది . ఈ హారర్ కాన్సెప్ట్ మూవీలో పూజా హెగ్డే నటించబోతుందట. అంతేనా బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో కూడా పూజ హెగ్డే హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో సూర్య ఆమెకు ఎలా లైఫ్ ఇవ్వబోతున్నాడో..?? టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగచైతన్య కూడా అదే విధంగా లైఫ్ ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . దీనితో పూజ హెగ్డే పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news