Movies"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" ఫస్ట్ డే కలెక్షన్స్: టాక్ అలా..వసూళ్లు ఇలా..విశ్వక్...

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ఫస్ట్ డే కలెక్షన్స్: టాక్ అలా..వసూళ్లు ఇలా..విశ్వక్ సేన్ రేంజ్ ఇదా..?

విశ్వక్సేన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి . అంతకుముందు ఎంతో ప్రయోగాత్మక “గామి” సినిమాలో నటించి మెప్పించారు. ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను రిలీజ్ చేశారు . ఈ సినిమాలో ఊర నాటు మాస్ లుక్ లో కనిపించాడు విశ్వక్సేన్ . యాక్షన్ ప్రధానంగా తీసుకొని తెరకెక్కిన ఈ సినిమాను కృష్ణ చైతన్య తనదైన రూట్ లో మార్చి మాస్ మసాలా యాడ్ చేసి జనాలను ఎంటర్టైన్ చేసే విధంగా తెరకెక్కించారు.

ఈ సినిమాలో హీరోయిన్లుగా నేహా శెట్టి – అంజలి నటించారు . నాగవంశీ – సాయి సౌజన్య కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు . శుక్రవారం విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది . ఓవర్గం ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చేసింది . అయితే మరో వర్గం ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా అస్సలు నచ్చలేదు. దీంతో సోషల్ మీడియాలో మిక్స్డ్ టాక్ సంపాదించుకున్నింది ఈ సినిమా .

కాగా విశ్వక్సేన్ నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. కావాలనే కొందరు తక్కువ రేటింగు ఇస్తున్నారు అంటూ మండిపడ్డాడు . కాగా లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ డే డీసెంట్ కలెక్షన్స్ రాబడినట్లు తెలుస్తుంది . నిజాం లో గట్టిగానే వసూళ్లు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఏకంగా కోటీ పది లక్షలు వచ్చిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైజాగ్‌లో 46 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 28 లక్షలు, వెస్ట్ గోదావరి 24 లక్షలు, గుంటూరు 30 లక్షలు, నెల్లూరు 17 లక్షలు, సీడెడ్‌ 76 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా మూడు కోట్ల 32 లక్షల గ్రాస్‌ సాధించింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు గా తెలుస్తుంది. మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్‌ మూవీకి ఇది డీసెంట్ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news