Movies"ఇక పై మా హీరో శర్వానంద్ ని అలా పిలవాల్సిందే".. ఫ్యాన్స్...

“ఇక పై మా హీరో శర్వానంద్ ని అలా పిలవాల్సిందే”.. ఫ్యాన్స్ న్యూ డిమాండ్ చూశారా..?

సినిమా ఇండస్ట్రీలో జనరల్గా స్టార్ హీరోస్ పేర్ల ముందు ఏదో ఒక ట్యాగ్ ఉంటుంది. మెగాస్టార్ ..రాకింగ్ స్టార్ ..స్టైలిష్ స్టార్ ..ఐకాన్ స్టార్ .. గ్లోబల్ స్టార్ ..మెగా పవర్ స్టార్.. ప్రిన్స్ సూపర్ స్టార్ ..ఇలా రకరకాల ట్యాగ్స్ తో పిలుచుకుంటూ ఉంటారు అభిమానులు. కాగా అలా ట్యాగ్స్ లేని హీరోలు కూడా ఉన్నారు. ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతున్న సరే శర్వానంద్ తన పేరు ముందు ఎప్పుడూ ఏ ట్యాగ్ ఉపయోగించుకోలేదు . ఫస్ట్ టైం ఆయన పేరు ముందు ట్యాగ్ పెట్టారు .

ఈ క్రమంలోని ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . తాజాగా హీరో శర్వానంద్ నటించిన సినిమా మనమే . కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా జూన్ 7వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు . ఈ ఈవెంట్లో చిత్ర బృందం చాలా జోష్ ఫుల్ గా పాల్గొనింది. ఈవెంట్లో మనమే సినిమా నిర్మాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ శర్వానంద్ కి ఒక స్టార్ ట్యాగ్ ఇచ్చారు . అది కాస్తా వైరల్ గా మారింది .

శర్వానంద్ కి చార్మింగ్ స్టార్ అంటూ ఒక సరి కొత్త ట్యాగ్ ఇచ్చారు . చార్మింగ్ స్టార్ అనే టైటిల్ లోగో అక్కడ స్క్రీన్ పై ప్లే చేసి మరి చూపించారు . దీంతో శర్వానంద ఫ్యాన్స్ అరుపులు కేకలతో స్టేడియం దద్దరిల్లిపోయింది . గతంలో మహానుభావుడు సినిమా టైంలో డైరెక్టర్ మారుతి ఏదో ఒక ట్యాగ్ పెట్టుకోమని చాలా పేర్లు వినిపించాడు అని.. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అంటూ వదిలేశానని .. ఇప్పుడు నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు అని ..థాంక్యూ సార్ అంటూ పొగిడేశారు. దీంతో శర్వా ఫ్యాన్స్ కూడా ఇకపై శర్వానంద్ ని అలానే పిలవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు . చార్మింగ్ స్టార్ శర్వానంద్ అంటూ ఓ రేంజ్ లో హ్యాష్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news