Movies"ఇకపై ప్రతి సినిమా విషయంలోను నా నిర్ణయం అదే".. ఎవ్వరు ఊహించిన...

“ఇకపై ప్రతి సినిమా విషయంలోను నా నిర్ణయం అదే”.. ఎవ్వరు ఊహించిన డెసిషన్ తీసుకున్న రాంచరణ్..!

జుట్టు ఉన్న అమ్మాయి ఎన్ని స్టైల్స్ అయినా వేసుకుంటుంది .. జుట్టు లేని బోడి గుండు ఆవిడ బోడి గుండుతోనే ఉంటుంది . ఇది మన ఇంట్లోని పెద్దవాళ్ళు చాలా సార్లు మనకి చెప్పిన సామెత . అయితే ఇప్పుడు ఇదే సామెతను అప్లై చేస్తున్నారు ఫాన్స్. రామ్ చరణ్ .. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో. రామ్ చరణ్ ప్రెసెంట్ ఎలాంటి స్థాయిలో ఉన్నాడో మనకు తెలిసిందే . నాన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఆ తర్వాత తనదైన స్టైల్ లో ముందుకు వెళుతూ వచ్చాడు .

కాగా ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు . రీసెంట్ గా రాంచరణ్ ఫాదర్స్ డే సందర్భంగా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు . నేషనల్ మీడియా ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూ పబ్లిష్ అయింది . ఈ క్రమంలోనే క్లింకారాతో ఉన్న కొన్ని రేర్ స్వీట్ మెమొరబుల్ ఫోటోలు షేర్ చేసుకున్నారు . ఇదే మూమెంట్లో క్లింకారా గురించి ఎక్స్ప్రెస్ చేస్తూ తనతో తన బాండింగ్ గురించి ఓపెన్ అప్ అయ్యారు. అంతవరకు బాగానే ఉంది ప్రతి తండ్రి కూడా తన కూతుర్లను ప్రేమిస్తాడు.. ఆమెతో బాండింగ్ బాగా పెంచుకుంటాడు. అందరికీ తెలిసిందే ..

అయితే రామ్ చరణ్ కి క్లింకార కోసం సినిమాల విషయంలో స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడట . తన కూతురు స్కూల్ వెళ్లే వరకు రామ్ చరణ్ ఎక్కడున్నా సరే ఆరు గంటలకల్లా ఇంట్లోకి వచ్చేస్తారట. షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నా సరే .. అంతేకాదు తన కూతురితో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి రామ్ చరణ్ కొన్ని సంవత్సరాలపాటు సినిమాలను నెమ్మదిగా ఓకే చేయాలి అంటూ డిసైడ్ అయ్యారట. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . మరొకపక్క ఆనంద పడుతున్నారు . కూతురు కోసం గ్లోబల్ స్టార్ ఎంతటి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు అంటుంటే.. ఎంత పెద్ద తోపైనా హీరో అయినా తండ్రి స్థానంలోకి వచ్చాక ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేయాలి అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందే అంటూ రాంచరణ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news