Moviesఉప్పలపాటి సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా.."కల్కి 2898AD" కోసం టోటల్...

ఉప్పలపాటి సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా..”కల్కి 2898AD” కోసం టోటల్ కృష్ణంరాజు ఫ్యామిలీ అలా చేయబోతుందా?

“కల్కి”.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు మారుమ్రోపోతుంది. నిన్న మొన్నటి వరకు ఈ పేరు గురించి కొద్ది మంది జనాలు మాత్రమే మాట్లాడుకునే వాళ్ళు .. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది . కేవలం ఐదు రోజులు ఐదు రోజులు అంటే ఐదు రోజులే.. ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పాన్ ఇండియా హీరో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు .

మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం అశ్విని దత్ ఏకంగా 600 కోట్లు ఖర్చు చేయడం సంచలనంగా మారింది. అంతేనా ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీస్ దీపికా పదుకొనే – దిశా పటాని నటిస్తూ ఉండటం కూడా సినిమాకి హైలెట్గా మారింది . ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ని ఈ సినిమాలో గెస్ట్ పాత్రలో చూపించబోతున్నాడు . ఈ క్రమంలోనే సినిమాకి మరింత హైప్స్ నెలకొంది . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వెరీ వెరీ వైరల్ గా మారింది .

ఎప్పుడు కూడా కృష్ణంరాజు ఫ్యామిలీ లోని లేడీస్ బయటకు వచ్చింది లేదు .. సినిమాల ప్రమోషన్స్ కోసం కానీ మిగతా విషయాల కోసం కానీ ఎప్పుడూ ఇన్వాల్వ్ అయింది లేదు.. ఫర్ ద ఫస్ట్ టైం ఉప్పలపాటి చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా జరగబోతూ ఉండటం అంటూ ప్రచారం జరుగుతుంది. కృష్ణంరాజు ఫ్యామిలీ లేడీస్ అంతా కలిసి ప్రభాస్ ని.. నాగ్ అశ్వీన్ ని అదేవిధంగా కల్కి టీం ని ఇంటర్వ్యూ చేయబోతున్నారట . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చే విధంగా ఈ ప్లాన్ చేశారట మేకర్స్. దీంతో రెబల్ ఫాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు . జనరల్ గా రెబల్ స్టార్ ని ఒక్కడిని చూస్తేనే పూనకాలు వచ్చేస్తాయి . ఇక కృష్ణంరాజు లాంటి లెజెండరీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒకే దగ్గర చూస్తే రచ్చ రంబోలానే అంటున్నారు. చూద్దాం మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వస్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news