Moviesఫస్ట్ చిరంజీవి..ఆ తరువాత రామ్ చరణ్.. ఇప్పుడు క్లీం కారా..ఏం వాడేసుకుంటున్నారు...

ఫస్ట్ చిరంజీవి..ఆ తరువాత రామ్ చరణ్.. ఇప్పుడు క్లీం కారా..ఏం వాడేసుకుంటున్నారు రా బాబు..!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఏ సినిమా కోసం చేయని రిస్క్ ను కల్కి సినిమా కోసం చేస్తూ ఉండడం గమనార్హం. మనకు తెలిసిందే ప్రభాస్ నటించిన కల్కి సినిమా మరికొద్ది రోజుల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. జూన్ 27వ తేదీ ఈ సినిమా గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు మేకర్స్ . అయితే ఈసారి చాలా డిఫరెంట్ స్ట్రాటజీను అప్లికేబుల్ చేశారు . కల్కి బుజ్జిని లాంఛ్ చేయడానికి ఓ గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ చేసి బొక్క బోర్ల పడిన సంగతి తెలిసిందే .

అయితే ఇప్పుడు ఆ స్ట్రాటజీని మరో విధంగా మలుస్తున్నారు . బుజ్జి వెహికల్ ని దేశంలోని ప్రధాన నగరాలలో తిప్పుతూ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు . అంతేకాదు ఇప్పుడు ఏకంగా పిల్లల దగ్గర నుంచి సినిమాను ప్రమోట్ చేయించే విధంగా మూవీ టీం ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో బుజ్జి బైరవ స్టిక్కర్స్ .. బొమ్మలు .. టీషర్ట్స్ అమ్ముతున్నారు .. అంతేనా పలువురు స్టార్ సెలబ్రిటీస్ పిల్లలకి ఫ్రీగా కూడా పంచేస్తున్నారు. తాజాగా సినీ పరిశ్రమలోని స్టార్ సెలబ్రెటీస్ పిల్లలకు కల్కి మూవీ టీం స్పెషల్ గిఫ్ట్ను పంపించింది .

ఈ గిఫ్ట్ లో బుజ్జి వెహికల్ బొమ్మ.. బుజ్జి రోబో బొమ్మ .. కొన్ని స్టిక్కర్స్ .. కల్కి పోస్టర్స్ ఒక లెటర్ కూడా ఉన్నాయి. ఈ కిట్ ను ఫస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన కూతురు క్లీన్ కారాకు పంపడం గమనార్హం. ఇదే విషయాన్ని ఉపాసన షేర్ చేసింది . క్లీం కార ఆడుకుంటున్న పిక్ ని పోస్ట్ చేసి ఆల్ ద బెస్ట్ చెప్పింది. దీంతో ఈ ఫొటోస్ వైరల్ గా మారాయి . అయితే ఈ ఫోటోలో కూడా ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడింది ఉపాసన. మొత్తానికి చిరంజీవిని ..రామ్ చరణ్ ని.. పవన్ కళ్యాణ్ నే కాదు క్లీం కార ని కూడా ఉపయోగించేసుకుంటుంది కల్కి టీం అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news