Moviesఫైనల్లీ ఆ రూమర్ నే నిజం చేసిన శ్రీ లీల.. అఫీషియల్...

ఫైనల్లీ ఆ రూమర్ నే నిజం చేసిన శ్రీ లీల.. అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసిందిగా..!

ఈ మధ్యకాలంలో శ్రీ లీల ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఎప్పుడైతే గుంటూరు కారం సినిమాలో నటించి.. ఆ సినిమా ద్వారా హ్యూజ్ ట్రోలింగ్ కి గురైందో అప్పటినుంచి ఈ బ్యూటీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది అన్న వార్తలు ఎక్కువగా వింటున్నాము. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల గుంటూరు కారం సినిమా తర్వాత ఎలా తన కెరియర్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకుందో అందరికీ తెలిసిందే..

తన ప్రిఫరెన్స్ ఉంటేనే సినిమాలో నటిస్తుంది.. లేకపోతే సినిమాను రిజెక్ట్ చేసి పడేస్తుంది . కాగా కొన్నాళ్ల నుంచి హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీ లీల ఓ సినిమా చేయబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఫైనల్లీ ఆ వార్తలే నిజం చేసింది శ్రీ లీల . దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . శ్రీ లీలా త్వరలోనే హను రాఘవపూడి డైరెక్షన్లో నటిస్తుంది. అయితే అది సినిమాలో అనుకుంటే పొరపాటే ఒక యాడ్ కోసం .. దీనికి సంబంధించిన పోస్ట్ లు సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రీ లీల .

శ్రీ లీల చాలా చక్కగా ట్రెడిషనల్ గా రెడీ అయిన పిక్స్ పక్కనే హను రాఘవపూడి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పిక్స్ ఆమె షేర్ చేసింది. ఆ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు శ్రీ లీల హను రాఘవపూడి పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. కాగా హను రాఘవపూడి తన సినిమాలో వర్క్ చేసే హీరోయిన్స్ లుక్స్ పై ఎలాంటి కాన్సన్ట్రేషన్ చేస్తాడో మనకు తెలుసు. చాలా క్లియర్ గా రియలిస్టిక్ గా క్లాసిక్ గా ఉండేలా చూసుకుంటాడు .. శ్రీ లీలా లుక్స్ కూడా అలానే ఉన్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news