Moviesఫైనల్లీ .. ఎట్టకేలకు ఆ తెలుగు హీరో సినిమాలు ఓకే చేసిన...

ఫైనల్లీ .. ఎట్టకేలకు ఆ తెలుగు హీరో సినిమాలు ఓకే చేసిన సమంత .. ఎంత స్పెషల్ అంటే..?

ఇన్నాళ్లు సోషల్ మీడియాలో సమంత పై ఎలాంటి వార్తలు వినిపించాయో మనం చూసాం. మరీ ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత చాలా చాలా బోల్డ్ గా మారిపోయింది అని తనదైన స్టైల్ లో ఒక్కొక్కరికి ఇచ్చి పడేస్తూ వచ్చింది అని వార్తలు వినిపించాయి. అంతేనా ఇష్టం వచ్చిన పని ఇష్టం వచ్చిన విధంగా చేసేసుకుంది అంటూ కూడా జనాలు బూతులు తిట్టారు.

అంతేకాదు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి అనుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు సినిమాలకు మాత్రం సైన్ చేయడం లేదు అంటూ తెగ ప్రచారం జరిగింది. అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఒక సెన్సేషనల్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు రచయితగా సిద్దు జొన్నలగడ్డ ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం సమంతను చూస్ చేసుకున్నారట మేకర్స్ .

హైలెట్ ఏంటంటే ఈ సినిమాలో సమంత హీరోయిన్ పాత్ర కాదు అయినా కూడా ఒప్పుకుందట . పెద్ద పెద్ద బడా తెలుగు స్టార్ సినిమాలలో అవకాశాలు వస్తున్న కూడా సిద్ధు జొన్నల గడ్డ లాంటి టైర్ 2 హీరో సినిమాలో ఆమె నటించడానికి ఒప్పుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది . ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్లో బాగా బాగా ట్రెండ్ అవుతుంది. చూద్దాం మరి దీనిపై హీరోయిన్ సమంత ఏ విధంగా స్పందిస్తుందో..??

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news