ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే పుష్ప2 సినిమాకి సంబంధించిన వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ – సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నటిస్తున్న సినిమానే ఈ పుష్ప2 రష్మిక మందన్నా.. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ స్థాయిలోనే ఖర్చు పెడుతూ వచ్చారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ రిలీజ్ చేయడానికి మొత్తం ప్లాన్ చేసుకున్నారు .
అయితే కొన్ని అనివార్య కారణాల చేత కొన్ని సీన్స్ రీ షూట్ చేయాల్సిన కారణంగా ఈ సినిమా అనుకున్న టయానికి రిలీజ్ చేయలేకపోతున్నాము అని .. డబల్ పవర్ ప్యాక్డ్ పర్ఫామెన్స్ తో మీ ముందుకు వస్తామంటూ పుష్ప2 కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది . డిసెంబర్ 6వ తేదీ ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. దీనితో ఒక్కసారిగా బన్నీ ఫాన్స్ బీపీలు పెరిగిపోయాయి . వెంటనే సోషల్ మీడియా వేదికగా మేకర్స్ కి చుక్కలు చూపించడం ప్రారంభించారు .
మాటలా..? తమాషాలా..? జోకులుగా ఉందా..? మీకు ఇష్టం వచ్చినప్పుడు సినిమా రిలీజ్ డేట్ ని మార్చేసుకుంటారా..? ప్రేక్షకుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారా..? మా మనోభావాలు దెబ్బతిన్నాయి వెంటనే పుష్ప2 సినిమాను అనుకున్న డేట్ నే రిలీజ్ చేయాలి . ఆగస్టు 15వ తేదీ సినిమా రిలీజ్ చేయకపోతే కోర్టులో కేసు వేస్తాను అంటూ ఓ బన్నీ అభిమాని సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాడు . అదేవిధంగా మరికొంతమంది బన్నీ ఫాన్స్ కూడా ఆ అభిమానికి సపోర్ట్ చేస్తున్నారు. మేము ఎంతో ఈగర్ గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం .. సినిమా షెడ్యూల్స్ అన్ని మీరు చూసుకోవాలి .. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవ్వాలి అంటూ నెటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు . చూద్దాం మరి అల్లు అర్జున్ దీనిపై ఎలా స్పందిస్తాడో..??