Moviesజూనియర్ ఎన్టీఆర్ కి రాత్రులు నిద్ర లేకుండా చేస్తున్న "ఆ" వ్యక్తి...

జూనియర్ ఎన్టీఆర్ కి రాత్రులు నిద్ర లేకుండా చేస్తున్న “ఆ” వ్యక్తి ఎవరో తెలుసా..? అంత టార్చర్ చేస్తున్నాడా..?

జూనియర్ ఎన్టీఆర్ .. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న ఒక హీరో . ఈ హీరో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . కొందరు హీరోలు డబ్బు కోసం సినిమాలు చేస్తారు .. మరికొందరు క్రేజ్ కోసం సినిమాలు చేస్తారు. అయితే ఈ హీరో మాత్రం కేవలం అభిమానుల కోసం మాత్రమే సినిమాలు చేస్తారు . తన స్టేటస్ తన స్థాయి తనపై ఎవరు ఏ విధంగా కోపడిన సరే అవ్వంతా కూడా పెద్దగా పట్టించుకోకుండా అభిమానుల కోసం ఏదైనా చేయడానికి డిసైడ్ అవుతాడు.

అలాంటి హీరోలలో మన ఎన్టీఆర్ మొదటి స్థానంలో ఉంటాడు అని చెప్పడంలో సందేహమే లేదు . జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు . వీళ్లది పెద్దలు కుదిరిచిన వివాహం . ఇద్దరు చాలా అన్యోన్యంగా చక్కగా ఉంటారు. వీళ్ళకి ఇద్దరు కుమారులు . ఒకరు అభయ్ రామ్ మరొకరు భార్గవ్ రామ్.. వీళ్ళ గురించి కూడా అందరికీ తెలిసిందే . బయట పెద్దగా కనిపించరు ..చాలా సైలెంట్ కానీ ఇంట్లో మాత్రం ఒకటే అల్లరి ..ఈ విషయాన్ని స్వయాన జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు .

తన కొడుకు అభయ్ చాలా చాలా సైలెంట్ పర్సన్ ..సౌమ్యుడు అని ..తనలాగే అని నవ్వుకుంటూ చెబుతాడు . అదేవిధంగా తన కొంటె పనులు కూడా వాడికి వచ్చాయి అంటూ నాటిగా చెప్తాడు . ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ తన కొడుకుల గురించి బయట ఎక్కువగా మాట్లాడడు. కానీ ఓ షోలో మాత్రం మాట్లాడారు. ఎప్పుడైనా దర్శకులతో కూడా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ తన అభయ్ చాలా చాలా అల్లరివాడు అని కొంటె పనులు ఎక్కువగా చేస్తుంటే చెప్పుకొస్తూ ఉంటాడట .

మంచి నిద్రపోతున్న మూమెంట్లో వచ్చి సడన్గా పటేల్ అని కొట్టి దాకుంటాడట.. అప్పుడు మనం పట్టుకోవాలట ..అభయ దగ్గర చాలా చాలా అల్లరి వేషాలు ఉన్నాయని ఆయన స్వయంగా బయట పెట్టడం గమనార్హం భార్గవ్ మాత్రం ప్రణతిలా చాలా సైలెంట్ గా ఉంటాడట. కాస్త హైపరే.. కానీ అల్లరి మాత్రం ఎక్కువగా చేయడట. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . దీంతో ఫాన్స్ కూడా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు . నీకు భార్గవ్ వల్ల ప్రాబ్లం లేదు అభ్య్ వల్లనే నిద్రకి ఆటంకం కలుగుతుందా..? అన్న అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news