Moviesఈ కన్నప్ప ఫైటర్ గర్ల్ ఎవరో తెలుసా..? మంచి విష్ణు మంచి...

ఈ కన్నప్ప ఫైటర్ గర్ల్ ఎవరో తెలుసా..? మంచి విష్ణు మంచి ఫిగర్ నే పట్టేశాడుగా..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కన్నప్ప సినిమాలో ఫైటర్ గర్ల్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న అమ్మాయికి సంబంధించిన పిక్చర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప . మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చూస్తూ ఉండడం సినిమాకే హైలెట్గా మారింది. మోహన్ బాబు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలాంటి స్టార్స్ ని పెట్టుకున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు తో పాటు మోహన్ బాబు – శివరాజ్ కుమార్ – ప్రభాస్ – అక్షయ్ కుమార్ – మధుబాల – కాజల్ అగర్వాల్ సహా అనేక మంది స్టార్స్ భాగం కాబోతున్నారు . ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అభిమానులను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది . ఆఫ్ కోర్స్ ఈ టీజర్ లో తప్పులను వెతుకుతూ ట్రోల్ చేసే జనాలు ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరికి మాత్రం ఈ సినిమాలో బాగా స్టాంట్స్ చేసిన ఫైటర్ గర్ల్ ఆకర్షణీయంగా కనిపించింది .

ఎవరు ఆ అమ్మాయి ఇంత చక్కగా నటిస్తుంది అంటూ ఆమె గురించి సెర్చింగ్ లు చేయడం ప్రారంభించారు . ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ అమ్మాయి ఎవరో కాదు.. ప్రీతి ముకుందన్ . క్యాడ్బరీ డైరీ మిల్క్ వంటి వివిధ యాడ్స్ లో యాక్ట్ చేసి మంచి పాపులర్ అయింది ప్రీతి ముకుందన్. ముట్టు ము2 మ్యూజిక్ ఆల్బమ్ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. కోలీవుడ్ లో రీసెంట్ గా స్టార్ మూవీలో యాక్ట్ చేసింది. ఆ సినిమాతో అక్కడ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల యంగ్ హీరో శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ మూవీలో యాక్ట్ చేసింది ప్రీతి ముకుందన్. ఇప్పుడు కన్నప్పతో పాన్ ఇండియా లెవెల్ లో సందడి చేసేందుకు రెడీ అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news