Movies"కల్కి" మూవీని నాగ్ అశ్వీన్ కంటే ముందే .. తెరకెక్కించాలి అనుకున్న...

“కల్కి” మూవీని నాగ్ అశ్వీన్ కంటే ముందే .. తెరకెక్కించాలి అనుకున్న ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్స్ కి మెయిన్ గా ఉండాల్సింది విజన్ ..క్రియేటివిటీ .. ఆ రెండు ఉంటే డెఫినెట్గా ఏ డైరెక్టర్ అయినా సరే సక్సెస్ అయిపోతారు . ఇలాంటి సినిమా తెరకెక్కిస్తే జనాలు చూడరేమో..? ఆదరించరేమో..? అన్న భయంతో వెనకడుగు వేస్తే ఎప్పుడూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు . అదే విషయాన్ని పక్కాగా ప్రూవ్ చేశాడు డైరెక్టర్ గుణశేఖర్. ఇండస్ట్రీలో గుణశేఖర్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు .

సినిమా ఇండస్ట్రీకి ఎన్నెన్నో మంచి హిట్ సినిమాలను అందించాడు . ప్రెసెంట్ ఆయన టైం బాగోలేదు . అందుకే ఆయన తెరకెక్కించే సినిమాలు జనాలను ఆకట్టుకోలేకపోతున్నాయి . నిజానికి ఒకప్పుడు గుణశేఖర్ తెరకెక్కించిన సినిమాలు ఎలా హిట్ అయ్యాయి అన్న విషయం మనం మర్చిపోకూడదు. అయితే కల్కి సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ తో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి షో తోనే బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ దక్కించుకుంది.

ప్రభాస్ పెర్ఫార్మెన్స్ – నాగ్ అశ్వీన్ డైరెక్షన్ ..మ్యూజిక్ .. విజువల్ ఎఫెక్ట్స్ ఒకటా రెండా..? చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో .. సినిమాని వేరే లెవెల్ లో నిలబెట్టే అంశాలు ఈ మూవీలో ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఇలాంటి కాన్సెప్ట్ ఇంతవరకు ఎందుకు మన తెలుగు డైరెక్టర్లు చూస్ చేసుకోలేదు అన్న విషయం ఇప్పుడు హైలైట్ గా మారింది. అయితే గతంలో గుణశేఖర్ ఇదే కాన్సెప్ట్ తో ఒక మూవీ ని తెరకెక్కించాలి అని భావించారట . కానీ ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పట్లో లేదు.. పైగా జనాలు ఇప్పుడు క్రియేటివిటీ ని కోరుకుంటున్నారు.

ఒకప్పుడు జనాలు సేమ్ రొమాంటిక్ లవ్ స్టోరీలు ..ఫ్యామిలీ సెంటి మెంట్ లని ఇష్టపడేవాళ్లు . ఇప్పుడిప్పుడే ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్ లో పురాణాల కి సంబంధించిన స్టోరీస్ ని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . పైగా ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలో నటించాలి అంటే భారీ క్యాస్ట్ అండ్ క్రూ కూడా అవసరం .. అప్పట్లో స్టార్ హీరోస్ ఇలాంటి పురాణాల కాన్సెప్ట్ తో తెరకెక్కే సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు అన్న రీజన్ తోనే గుణశేఖర్ కల్కి లాంటి కథను రాసుకొని కూడా తెరకెక్కించకుండా ఆగిపోయారట. ఫైనల్లీ అలాంటి ఒక బిగ్ సాహసం చేశాడు నాగ్ అశ్వీన్.. మొత్తానికి నాగ్ అశ్వీన్ తన సరికొత్త ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లి రాబోయే జనరేషన్స్ ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అనే విషయాలను బాగా తన విజన్ తో చూపించాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news