Moviesబన్నీ నోటి దూల.. కోపంతో రష్మిక మందన్నా ఏం చేసిందో తెలుసా..?

బన్నీ నోటి దూల.. కోపంతో రష్మిక మందన్నా ఏం చేసిందో తెలుసా..?

పాపం బన్నీ తాను ఏదో అనుకుంటే ఇంకోటి ఏదో జరిగిపోయింది.. ఏదో అనుకొని తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేశాడు.. అయితే ఇప్పుడు తనకి సపోర్ట్ చేసే దిక్కే లేకుండా పోయింది. ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ ..స్టైలిష్ స్టార్ ..పాన్ ఇండియా స్టార్ అంటూ తెగ పొగిడేస్తారు జనాలు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి ఈయనకి సంబంధం లేదు అంటూ ప్రచారం జరుగుతుంది . దానంతటికీ కారణం ఏపీ పాలిటిక్స్ అన్న విషయం తెలిసిందే . ఏపీ పాలిటిక్స్ లో గెలుపొందిన నారా చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్ బాగానే ఉన్నాడు .. ఓడిపోయిన వైసిపి పార్టీ వాళ్ళు బాగానే ఉన్నారు.. మధ్యలో బన్నీకే పెద్ద చికాకులు చిక్కులు తెచ్చిపెట్టింది .

వైసిపి కాండిడేట్ కి సపోర్ట్ చేయడంతో తీవ్రంగా హర్ట్ అయ్యారు మెగా ఫాన్స్. దీంతో ట్రోలింగ్ స్టార్ట్ చేశారు . ఆ ట్రోలింగ్ కాస్త పుష్ప2 సినిమా వాయిదా పడేలా చేసింది . నిజానికి ఆగస్టు 15వ తేదీ సినిమా రిలీజ్ అవ్వాలి ..కానీ కొన్ని కారణాల చేత డిసెంబర్ 6 వాయిదా వేశారు . దీని పట్ల బన్నీ ఫాన్స్ ఎంత డిసప్పాయింట్ అయ్యారో అందరికీ తెలిసిందే. అయితే అందరికన్నా రష్మిక మందన్నా కూసింత ఎక్కువ డిసప్పాయింట్ అయింది . ఎందుకా అనుకుంటున్నారా..? డిసెంబర్ 6వ తేదీ రష్మిక మందన్నా నటించిన మరో సినిమా కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది . తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది రష్మిక మందన్నా..

విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా ఒక సినిమా తెరకెక్కుతుంది. ఆ సినిమానే చావా . చత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది . అయితే ఈ సినిమాను కూడా డిసెంబర్ 6వ తేదీ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారట. దీంతో హిందీలో టఫ్ సిచువేషన్ ఎదుర్కోబోతుంది రష్మిక . అటు పుష్ప2 ఇటు చావా ఏ సినిమాని చూస్తారో జనాలు అంటూ రష్మిక ఫుల్ టెన్షన్ పడుతుంది. పుష్ప2 లైఫ్ ఇచ్చింది చావ లైఫ్ ఇవ్వబోతుంది.. దీంతో రష్మిక పరిస్థితి అయోమయంగా మారింది . అంతే కాదు రష్మిక బన్నీపై కోపంగా కూడా ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news