ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు . కేవలం కొద్దిగంటలు మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం రెబల్ ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో అంతకు డబల్ రేంజ్ లోనే మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తూ ఉండటం గమనార్హం. మరీ ముఖ్యంగా ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకు తెరకెక్కకపోవడం పైగా మన తెలుగు డైరెక్టర్ ఇలాంటి ఒక సరికొత్త కాన్సెప్ట్ ని తెరకెక్కిస్తూ ఉండడం అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది.
అదే విధంగా ఇంట్రెస్టింగ్ గా మారింది. రీసెంట్గా సోషల్ మీడియాలో కల్కి సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. కల్కి సినిమాకు ముందు అనుకున్న టైటిల్ ఇదే అంటూ ప్రచారం జరుగుతుంది . నాగ్ అశ్వీన్ ఈ సినిమా కోసం ముందుగా యుగపురుషుడు అనే టైటిల్ ని అనుకున్నారట . కానీ యుగపురుషుడు అనే పేరు చాలా ఓల్డ్ గా ఉంది అని .. ఈ జనరేషన్ పిల్లలకి పెద్దగా ఎక్కలేదు అని ..
నాటిగా క్యాచీగా టైటిల్ ఉండేలా నేటి జనరేషన్ పిల్లలు కూడా ట్రై చేసేలా కల్కి అంటూ తనదైన స్టైల్ లో పేరును మార్చారట. యుగపురుషుడు అన్న టైటిల్ పెట్టింది కూడా నాగ్ అశ్వీన్.. కల్కి అన్న టైటిల్ పెట్టింది కూడా నాగ్ అశ్వీన్.. ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ మూవీ టీం ఓటింగ్ తో కల్కి కి ఎక్కువ ఓట్లు వచ్చాయట . అందుకే కల్కి అంటూ ఈ సినిమాకి నామకరణం చేశారట. మొత్తానికి టైటిల్ తోనే సగం హిట్ కొట్టాడు ఈ నాగ్ అశ్వీన్..చూద్దాం ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో..?