Moviesప్రియాంక దత్ కి నాగ్ అశ్విన్ ఎలా ప్రపోజ్ చేశాడో తెలుసా..?...

ప్రియాంక దత్ కి నాగ్ అశ్విన్ ఎలా ప్రపోజ్ చేశాడో తెలుసా..? వీళ్ల లవ్ స్టోరీ భలే విచిత్రంగా ఉందే..!!

నాగ్ అశ్వీన్.. ఇప్పుడు ఇండస్ట్రీని శాసిస్తున్న పేర్లలో ఇది కూడా ఒకటి . టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. చాలా తక్కువ సినిమాలే తెరకెక్కించిన కూడా ఆయనను జనాలు గుండెల్లో పెట్టుకునే విధంగా తెరకెక్కించడం స్పెషాలిటీ . కాగా చాలా పొదుపుగా మాట్లాడుతాడు. ప్రతిభకు మాత్రం అవధులు ఉండవు… తన పని తాను చూసుకొని పోతూ ఉండే నాగ్ అశ్వీన్.. కల్కి సినిమా ద్వారా సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు . ప్రభాస్ హీరోగా దిశాపటాని – దీపికా పదుకొనే హీరోయిన్గా నటించిన కల్కి సినిమా నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయింది .

ఈ సినిమా హ్యూజ్ పాజిటివ్ టాక్ అందుకుంది . ఈ క్రమంలోనే నాగ్ అశ్వీన్ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . మనందరికీ తెలిసిందే నాగ్ అశ్వీన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్న అశ్విని దత్ అల్లుడు . నాగ్ అశ్వీన్ అసలు పేరు నాగ అశ్విన్ రెడ్డి . హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యులు జయ్రాం రెడ్డి జయంతి దంపతుల బిడ్డ . కాగా జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన నాగ్ అశ్వీన్ పేరెంట్స్ మాదిరి డాక్టర్ అవుతారు అని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఎవరు ఊహించిన విధంగా ఇలా సినిమా ఫీల్డ్ లోకి వచ్చారు.

నాగ్ అశ్వీన్ ప్రముఖ ప్రొడ్యూసర్ అశ్విని దత్ కూతురు ప్రియాంక దత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . త్రీ ఏంజెల్ స్టూడియో పేరుతో సారొచ్చారు – బాణం – ఓం శాంతి -యాదోంకి బరత్.. అనే సినిమాలను నిర్మించారు . కొన్ని యాడ్స్ కూడా చేశారు . అదే సమయంలో నాగ్ అశ్వీన్ పరిచయం కావడం ఆ తర్వాత వీరిద్దరూ కలిసి యాదోం కి బరత్ అనే షార్ట్ ఫిలిం కోసం పనిచేయడం జరిగింది . ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో వీళ్ల స్నేహం ప్రేమగా మారింది .

ఆ తర్వాత ప్రియాంక తన ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో నాగ్ అశ్వీన్ ఇలా ప్రపోజ్ చేశారు . “మీకు ఎవరైనా నచ్చితే సరే.. లేదంటే మనం పెళ్లి చేసుకుందామంటూ నాగ్ అశ్వీన్ చాలా హుందాగా చాలా తెలివిగా సేఫ్ జోన్ లో ప్రపోజ్ చేశారు”. ప్రియాంక ఆయన మాటలకు పడిపోయింది . ఆయనలోని మంచితనాన్ని గ్రహించింది . వెంటనే ఇంట్లో పెద్దలకు చెప్పి 2015లో పెళ్లి చేసుకున్నారు. ప్రెసెంట్ నాగ్ అశ్వీన్ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో మారు మ్రోగి పోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news