మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసే జనాలు ఎప్పుడూ రెడీగా ఉంటారు . మెగా ఫ్యామిలీ ఆనందంగా ఉంటే చూసి ఓర్వలేని జనాలు ఎంతో మంది ఉన్నారు . మెగా ఫ్యామిలీని ఎప్పుడు టార్గెట్ చేసి ట్రోల్ చేసేవాళ్లను మనం చూస్తూనే ఉంటాం . ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ నుంచి వరుసగా బ్యాక్ టు బ్యాక్ అన్ని గుడ్ న్యూస్ లే వింటున్నాం. దీంతో మెగా హేటర్స్ కు బాగా కుళ్లు ఎక్కువైపోయినట్లుంది . అందుకే మెగా ఫ్యామిలీ మంచి చేసిన సరే దాన్ని చెడుగా చిత్రీకరిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న ఏపీ డిప్యూటీ సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకార ఉత్సవానికి చాలామంది హాజరయ్యారు.
అయితే అందరిలోకి హైలైట్ గా నిలిచింది మెగా ఫ్యామిలీ . ఫ్యామిలీ మొత్తం బస్సు వేసుకొని మరి ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లారు. అంతేకాదు మెగా ఫ్యామిలీ చేసిన సందడి కూడా అక్కడ హైలైట్ గా మారింది . అయితే ఇక్కడే మెగా హెటర్స్ కడుపు మండిపోయినట్లుంది. ఒక డిప్యూటీ సీఎం గా ప్రమాణస్వీకారం చేస్తూ ఉంటే ఇంత ఓవరాక్షన్ అవసరమా ..? అంటూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంది డిప్యూటీ సీఎం గానే.. అంతేగాని సీఎంగా కాదు ..అసలు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని రాజకీయాల్లోకి వచ్చాడు ..ఆ స్థానం వచ్చుంటే నిజంగా అందరికీ హ్యాపీ నే..
అయితే నారా చంద్రబాబునాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా అంత అరుపులు కేకలు రాలేదు. మరి ఈ పవన్ కళ్యాణ్ చేస్తున్నప్పుడు ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ అనే విధంగా కామెంట్స్ చేశారు . పవన్ తన గమ్యాన్ని మర్చిపోతున్నాడు అంటూ కూడా ట్రోల్ చేశారు . అయితే వాళ్లకి బాగా స్ట్రైట్ గా కౌంటర్స్ ఇస్తున్నారు మెగా ఫ్యాన్స్ . ఎప్పుడొచ్చామా అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనే మహేష్ బాబు డైలాగులు బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఫస్ట్ స్టెప్పే కొండపైకి వేయకూడదు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి ..ఇప్పుడు డిప్యూటీ సీఎం నెక్స్ట్ టైం ఏపీ సీఎం.. గెట్ రెడీ నెక్స్ట్ టార్గెట్ జనసైనికుల్లారా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడమే అంటూ ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు..!!