Moviesఫ్యాన్స్ కి ఆ బెంగ తీర్చేసిన డార్లింగ్.. ఇక రెబల్ అభిమానులకి...

ఫ్యాన్స్ కి ఆ బెంగ తీర్చేసిన డార్లింగ్.. ఇక రెబల్ అభిమానులకి రచ్చ రంబోలానే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినీ సర్కిల్స్ లో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేస్తున్నాడు . బాహుబలి సినిమా తర్వాత ఆ లెవల్ సినిమాలను చూస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఈ హీరో. కాగా ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా కల్కి . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు.

జూన్ 27వ తేదీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో ఓ ఈవెంట్ నిర్వహించారు చిత్ర బృందం. ఈ ఈవెంట్లో ప్రభాస్ చాలా యాక్టివ్ గా కనిపించారు . అంతేకాదు ఈ ఈవెంట్లో ప్రభాస్ లుక్స్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. నిజానికి బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ లుక్స్ ఏ సినిమాలోనూ అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి..

ఆ బెంగ ఎప్పటినుంచో అలానే ఉండిపోయింది . ఇన్నాళ్ళకి కల్కి సినిమా ద్వారా ఆ బెంగ తీర్చేస్తున్నాడు ప్రభాస్ అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ ఏదో అరాచకం సృష్టించేలానే ఉన్నాడు అన్నది మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. చూద్దాం ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డ్స్ బద్ధలు కొట్టబోతున్నాడో..? జూన్ 27 వ తేదిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news