Moviesకని విని ఎరుగని ఊహించిన డైరెక్టర్ తో సినిమాకు కమిట్ అయిన...

కని విని ఎరుగని ఊహించిన డైరెక్టర్ తో సినిమాకు కమిట్ అయిన చరణ్..ఇక ముద్దులే ముద్దులు..హగ్గులే హగ్గులు..!!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఉండే హీరోలు ఎలాంటి టైప్ ఆఫ్ సినిమాలను చూస్ చేసుకుంటున్నారో గెస్ చేయడం కష్టంగా మారిపోయింది. ఒక్కొక్క హీరో ఒక్కొక్క కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చూసుకుంటున్నారు . మరీ ముఖ్యంగా పాన్ ఇండియా స్టేటస్ వచ్చాక తమ ఫేవరెట్ హీరోస్ ఎలాంటి డైరెక్టర్స్ తో కమిట్ అవుతున్నారు..? ఎలాంటి జోనర్ లో సినిమాలను ఓకే చేస్తున్నారు అనే విషయం గురించి ఎక్కువగా ఆరా తీయడం మొదలుపెట్టారు అభిమానులు . ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వార్త బాగా హైలైట్ గా మారింది.

రామ్ చరణ్ ప్రజెంట్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుంది . ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటించబోతుంది . కాగా ఈ సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రీమారన్ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయినట్లు రామ్ చరణ్ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఇప్పుడు తాజాగా మరొక వార్త టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. అర్జున్ రెడ్డి – అనిమల్ సినిమాలతో ఇండస్ట్రీ షేక్ చేసి పడేసిన సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాకి కమిట్ అవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

ఇప్పటికే స్క్రిప్ట్ గురించి చిరంజీవి రాంచరణ్ తో చర్చలు జరిపేసాడట సందీప్ రెడ్డివంగా. సందీప్ రెడ్డివంగాకి మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎన్నో ఇంటర్వ్యూలలో ఆ విషయాన్ని బయటపెట్టారు . ఇదే క్రమంలో రాంచరణ్ తో సందీప్ రెడ్డి వంగ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్న విషయం బాగా బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. గతంలో ఆయన తెరకెక్కించిన అర్జున్ రెడ్డి – అనిమల్ సినిమాలు చూసి ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా ఏ విధంగా ఉంటుంది అనే విధంగా జనాలు మాట్లాడుకుంటున్నారు . అర్జున్ రెడ్డి సినిమా ఏ విధంగా ఉంటుందో దానికి 100 రెట్లు బోల్డ్ గా ఉంటుంది అనిమల్ సినిమా .. మరి ఇప్పుడు రాంచరణ్ తో ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తారో..? అంటూ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు..???

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news