Moviesకూతురు బర్తడేకి ముందే అద్దిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన చరణ్.. మెగా...

కూతురు బర్తడేకి ముందే అద్దిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన చరణ్.. మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!

నేడు ఫాదర్స్ డే సందర్భంగా చాలామంది స్టార్ సెలబ్రిటీస్ తమ తండ్రులతో ఉన్న ఆనందాన్ని పంచుకున్న ఫోటో షేర్ చేస్తున్నారు.. ఇలాంటి క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఫస్ట్ ఫాదర్స్ డే ను చాలా చాలా ఎమోషనల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు . రామ్ చరణ్ మెగా హీరో.. మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్ .. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు .. గ్లోబల్ స్థాయిలో క్రేజ్ కూడా దక్కించుకున్నాడు . ప్రెసెంట్ రాంచరణ్ పేరు చెప్తే గ్లోబల్ స్థాయిలో ఓ రేంజ్ లో అరుపులు కేకలు వినపడతాయి.

కాగా రామ్ చరణ్ ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . దాదాపు పెళ్లయిన పదకండేళ్ల తర్వాత వీళ్ళు తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు . క్లీంకార వీళ్ళకు హ్యాపీనెస్ తీసుకొచ్చింది. క్లింకార పుట్టినప్పటినుంచి రామ్ చరణ్ ఎంతలా మారిపోయాడో మనం చూస్తూనే ఉన్నాం . నేడు ఫాదర్స్ డే సందర్భంగా క్లీం కార తో ఉన్న రేర్ ఫోటో బయటకు వచ్చింది . ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు .

ఇవాళ ఇంటర్వ్యూ పబ్లిష్ అయింది . ఫాదర్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ కావడంతో క్లీంకారాతో దిగిన ఫోటో కూడా పబ్లిష్ అయింది . ఈ ఫోటోలో క్లింకార సైడ్ కట్స్ నుంచి మొత్తం రివీల్ అయిపోయింది . కొందరు రామ్ చరణ్లా ఉంది అంటుంటే కాదు కాదు ఉపాసన లా ఉంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న క్లీం కార ఫోటో రివిల్ కావడంతో ఫాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతేకాదు క్లింకార పుట్టినరోజు మరో నాలుగు రోజుల్లో రాబోతుంది. జూన్ 20వ తేదీ ఆమె పుట్టిన రోజు.. పుట్టినరోజుకు ముందే ఇలాంటి స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వడం పట్ల మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఆ ఫోటోని తెగ ట్రెండ్ చేసేస్తున్నారు . ఎంత పెద్ద గ్లోబల్ స్టార్ అయినా సరే ఈ రేర్ ఫీలింగ్ ని ఎంజాయ్ చేయాల్సిందే అంటూ రాంచరణ్ కు సలహా ఇస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news