Moviesబాలీవుడ్ పద్ధతులు అంటే ఇవేనా..? పెళ్లిలో అలాంటి పని చేసి అందరికి...

బాలీవుడ్ పద్ధతులు అంటే ఇవేనా..? పెళ్లిలో అలాంటి పని చేసి అందరికి షాక్ ఇచ్చిన సోనాక్షి సిన్హా..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ కూడా ఓ విధంగా ఏకీపారేస్తున్నారు జనాలు . ఎప్పుడెప్పుడు ఏ స్టార్ సెలబ్రిటీ దొరుకుతుందా..? ఏ స్టార్ గట్టు రట్టు చేద్దామా..? అంటూ కాచుకొని కూర్చున్నారు కొందరు . అయితే అలాంటి వాళ్ళకి అడ్డంగా దొరికిపోయింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా. బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న ఈ భామ రీసెంట్ గా పెళ్లి చేసుకుంది . కొన్నేళ్లుగా నటుడు జహీర్ ఇక్బాల్ తో ప్రేమాయణం నడుపుతుంది అన్న వార్త బాగా ప్రచారంలోకి వచ్చింది .

వీరిద్దరూ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారట . అయితే తాజాగా ఈ జంట పెళ్లితో ఒకటైంది . సోనాక్షి సిన్హా – జహీర్ ఇక్బాల్ పెళ్లి జూన్ 23వ తేదీ ఘనంగా జరిగింది . బాలీవుడ్ స్టార్ శత్రుఘ్న కూతురే ఈ సోనాక్షి . అయితే కోట్ల ఆస్తి ఉన్నా సరే చాలా సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది సోనాక్షి . గ్రాండ్గా రిసెప్షన్ మాత్రం చేసుకున్నారు. వీరి పెళ్లి రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి . దీంతో పలువురు సెలబ్రిటీలు శ్రేయోభిలాషులు వాళ్లకు విషెస్ అందిస్తున్నారు.

అయితే సోనాక్షి సిన్హా పెళ్లిలో చేసిన పని ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది . సోనాక్షి సిన్హా చాలా చాలా సైలెంట్ పర్సన్ అని అంతా అనుకుంటారు . కానీ కానే కాదు సోనాక్షి సిన్హా చాలా చాలా అల్లరి అమ్మాయి రిజిస్టర్ మ్యారేజ్ అయిపోగానే తన భర్తను హగ్ చేసుకుని రచ్చ రంబోలా చేసింది . దానికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి . అప్పటివరకు చాలా సైలెంట్ గా ఉన్న సోనాక్షి వెంటనే పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టగానే తనలో కొత్త మార్పులు వచ్చిన విధంగా బిహేవ్ చేసేసింది . పేరెంట్స్ – దేవుళ్ల ఆశీర్వాదాలతో ఒక్కటే ఇప్పుడు మేము భార్యాభర్తలం అంటూ పోస్ట్ కూడా చేసింది . దీనితో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . అయితే కొంతమంది ఇది బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే తంతే అని ..ప్రేమ మోజు ఉన్నంతవరకు బాగానే ఉంటారు ..ప్రేమ మోజు తీరిపోగానే విడాకులు తీసుకుంటారు అంటూ వ్యంగ్యంగా వెటకారంగా ట్రోల్ చేస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news