Moviesబిగ్ బ్రేకింగ్: "కల్కి సినిమాలో నా ఒరిజినల్ క్యారెక్టర్ అదే"..గూస్ బంప్స్...

బిగ్ బ్రేకింగ్: “కల్కి సినిమాలో నా ఒరిజినల్ క్యారెక్టర్ అదే”..గూస్ బంప్స్ మ్యాటర్ ని రివీల్ చేసిన ప్రభాస్..!

సినిమాని తెరకెక్కించే విధానం ఎలా అయినా ఉండొచ్చు కానీ ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే విధానం మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి . అప్పుడే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది . ఈ మధ్యకాలంలో డైరెక్టర్స్ హీరోస్ బాగానే తమ సినిమాల విషయంలో ప్రమోషన్స్ చేస్తున్నారు . అయితే ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా విషయంలో మాత్రం నాగ్ అశ్విన్ ప్రమోషన్స్ లో ఎక్కడో వెనుక పడ్డారు అంటూ టాక్ వినిపించింది . పలువురు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అదే ఫీలింగ్ వ్యక్తం చేశారు .

అయితే ఎవరు ఊహించని విధంగా తనలోని మరో స్ట్రాటజీని బయట పెట్టాడు . ప్రభాస్ క్యారెక్టర్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా విజువల్స్ ఉన్నాయి అంటూ సెకండ్ ట్రైలర్ చూడగానే ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు పలుచోట్ల బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే టికెట్లు హాట్ కేకుల్లా సేల్ అయిపోతున్నాయి . అయితే తాజాగా కల్కి సినిమాలో నటిస్తున్న నటులు..ప్రభాస్ -కమల్ హాసన్ – అమితాబచ్చన్ – దీపికా పదుకొనే -ప్రియాంక దత్ -స్వప్న దత్తులతో కలిసి ఒక స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు .

దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ చిట్ చాట్ లో మూవీ టీం మొత్తం పాల్గొనడం అదేవిధంగా మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని ప్రభాస్ ఓపెన్ గా చెప్పడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. “బాహుబలి తర్వాత మళ్ళీ కామెడీ ఈ సినిమాలోనే చేశాను ..అలాగే కొంచెం నెగిటివ్ షేడ్శ్ కూడా ఉన్నాయి .. నా ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో ఈ సినిమా సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది ..ఈ క్యారెక్టర్ నా కెరియర్ లోనే ది బెస్ట్ క్యారెక్టర్ అని నేను నమ్ముతున్నాను “అంటూ ప్రభాస్ స్వయంగా మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది . దీంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు జనాలు. మరో మూడు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది అనగా ప్రభాస్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సినిమాకి భారీ బజ్ క్రియేట్ చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news