ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినీ వర్గాలలో తెగ హల్చల్ చేస్తుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద రొమాంటిక్ క్యూట్ ప్రేమ పక్షులుగా పేరు సంపాదించుకున్న మలైకా అరోరా ..అర్జున్ కపూర్ విడిపోయారా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . గతంలో వీళ్ల గురించి చాలా వార్తలు వైరల్ అయ్యాయి. వీళ్ళు ప్రేమించుకుంటున్నారు అని.. డేటింగ్ లో ఉన్నారు అని.. పెళ్లి చేసుకోబోతున్నారు అని.. ప్రేమకి ఏజ్ అడ్డురాదు అని.. ప్రూవ్ చేయబోతున్నారు అని ..ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి.
దానికి తగ్గట్టే ఈ జంట కూడా బాగా పబ్లిక్ లో చేతిలో చేయి వేసుకొని చట్టపట్టలేసుకొని తిరిగింది. అంతేకాదు వీళ్ళకి సంబంధించిన కొన్ని రొమాంటిక్ ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. సీన్ కట్ చేస్తే మోజు తీరిపోయిందో..? లేకపోతే మరి కారణం ఏదైనా బలంగా ఉందో ..? తెలియదు కానీ ఈ జంట విడిపోయినట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది . ఈ మధ్యకాలంలో అర్జున్ కపూర్ – మలైకా ఎక్కడ కలిసి కనిపించడం లేదు .
అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ ఈవెంట్ అయినా .. ఏ ఫంక్షన్ అయినా.. చటుక్కున వాలిపోయే ఈ జంట.. ఇప్పుడు సింగిల్ సింగిల్గానే ఎంజాయ్ చేస్తుంది. సింగిల్గానే మలైకా అరోరా హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తుంది. అర్జున్ కపూర్ అసలు బయట కనిపించడమే మానేశారు . ఇన్సైడ్ నుంచి అందుకున్న సమాచారం ప్రకారం అర్జున్ కపూర్ మలైకారోర విడిపోయినట్లు న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు నేషనల్ మీడియాలో కూడా వీళ్ళ బ్రేకప్ గురించి వార్తలు వస్తూ ఉండడం ఇప్పుడు హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. చూడాలి మరి దీనిపై ఈ జంట ఎలా స్పందిస్తుందో..??