Moviesబిగ్ బ్రేకింగ్ : బన్నీకి మరో భారీ బొక్క..ఎలా కోల్కుంటాడో ఏమో..!?

బిగ్ బ్రేకింగ్ : బన్నీకి మరో భారీ బొక్క..ఎలా కోల్కుంటాడో ఏమో..!?

పాపం .. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు బన్నీ ఏదో ఊహించుకున్నాడు మరేదో జరిగిపోయింది . సోషల్ మీడియాలో ప్రజెంట్ అల్లు అర్జున్ పేరు ట్రెండ్ అవుతుంది. దానికి కారణం కూడా మనకు తెలిసిందే . ఇంట్లో సొంత మామయ్య ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉంటే జస్ట్ ఒక ట్విట్ చేసేసి ఆ తర్వాత ఆయన ఫ్రెండ్ అయినా వైసీపీ క్యాండిడేట్ కు సపోర్ట్ చేయడానికి ఏకంగా నంద్యాల వెళ్ళాడు అల్లు అర్జున్ . ఈ విషయం అప్పట్లో ఎంత సంచలనంగా మారింది అనే విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ ఒక్క పరిణామంతో మెగా ఫ్యామిలీకి దూరమైపోయాడు బన్నీ . ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోలు ఎవరు కూడా బన్నీని పట్టించుకోవడం లేదు. అంతేకాదు మెగా ఫ్యామిలీ నుంచి బన్నీను వెలివేశారు అన్న వార్త కూడా బాగా ట్రెండ్ అవుతుంది. ఇలాంటి క్రమంలోనే మరికొద్ది గంటల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతూ ఉండడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుస్తాడా..? లేదా..? అనే విషయం హాట్ టాపిక్ గా వైరల్ గా మారింది.

ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే మాత్రం బన్నీకు మెగా హీరోలు మెగా ఫాన్స్ చుక్కలు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. పుష్ప 2 సినిమాని ప్లాప్ చేస్తామంటూ స్ట్రైట్ గానే కౌంటర్స్ వేస్తున్నారు. అంతేకాదు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కే బన్నీ సినిమా కూడా ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతుంది .. మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఎంత జాన్ జిగిడి దోస్తులు అనే విషయం తెలిసిందే.. పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకుండా వైసిపి కాండిడేట్ కు సపోర్ట్ చేయడం పట్ల త్రివిక్రమ్ కూడా డీప్గా హార్ట్ అయ్యారట. ఈ క్రమంలోనే బన్నితో తెరకెక్కించే సినిమాలు ఆపేసుకున్నారట సినీ వర్గాలలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. పుష్ప2 సినిమాని ప్లాప్ చేస్తాను అని చెప్పడం అదేవిధంగా త్రివిక్రమ్ సినిమా ఆగిపోతుంది అని వార్తలు రావడం.. ఇప్పుడు బన్నీ అభిమానులకు అస్సలు మింగుడు పడడం లేదు. బన్నీ ఎలా తట్టుకుంటాడో అంటూ ఫ్యాన్స్ కూడా బాధపడిపోతున్నారు . అయితే బన్నీ అభిమానులు ఆయనకు సపోర్ట్ చేస్తూ ధైర్యంగా ఉండడం గమనార్హం..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news