Movies"కల్కి"లో భైరవ పాత్ర ..ఎన్టీఆర్ హిట్ సినిమా నుండి కాపీ చేశారా..?

“కల్కి”లో భైరవ పాత్ర ..ఎన్టీఆర్ హిట్ సినిమా నుండి కాపీ చేశారా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ తో సోషల్ మీడియాలో కొంతమంది జనాలు కల్కి సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పాన్ ఇండియా హీరో ప్రభాస్ తాజాగా నటించిన సినిమా “కల్కి”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . మొదటి రోజే ఏకంగా 180 కోట్లు కలెక్షన్స్ సాధించి సినిమా సెన్సేషనల్ రికార్డు నెలకొల్పింది .

ఇండియన్ హిస్టరీలోనే మొదటిరోజు ఎక్కువ కలెక్షన్స్ సాధించిన అతిపెద్ద మూడవ సినిమాగా చరిత్ర సృష్టించింది . ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఒకానొక మూమెంట్లో నెగిటివ్ షేడ్శ్ లో కూడా కనిపిస్తారు . అయితే అంత పెద్ద స్టార్ హీరోని నెగిటివ్ షేడ్శ్ లో చూపించడం అనేది చాలా రిస్కీ మ్యాటర్ ..ఫాన్స్ కొన్నిసార్లు అలాంటి విషయాలను యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు.

అయితే ఈ ప్రభాస్ పాత్రతరహాలోనే గతంలో ఎన్టీఆర్ కూడా ఒక సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో కనిపించాడు అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా టెంపర్. ఈ సినిమాలో ఫస్ట్ మొత్తం కూడా మనకి జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ పాత్రలోనే కనిపిస్తారు . ఆ తర్వాత పాజిటివ్ గా జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ని చూపిస్తాడు పూరి జగన్నాథ్ . ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది . ఇలా ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ అందరూ కూడా నెగిటివ్ షేడ్స్ లో కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news