Moviesఇండియన్ సినీ చరిత్రను తిరగరాసిన భైరవ..ఏ హీరో టచ్ చేయలేని క్రేజీ...

ఇండియన్ సినీ చరిత్రను తిరగరాసిన భైరవ..ఏ హీరో టచ్ చేయలేని క్రేజీ రికార్డ్..రెబల్ ఫ్యాన్స్ కి పండగే..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్ ఉన్నా సరే క్రేజీ రికార్డ్స్ నెలకొల్పే సత్తా కొంతమందికే ఉంటుంది . అలాంటి వాళ్ళల్లో టాప్ పొజిషన్లో ఉంటాడు మా డార్లింగ్ ప్రభాస్ అంటూ ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఆయనను పొగిడేస్తున్నారు . రీసెంట్గా ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ కల్కి . ఈ సినిమా ఎలాంటి ఘనవిజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా నాగ్ అశ్వీన్ డైరెక్షన్ ఈ సినిమాకి హైలైట్ గా మారింది . మహాభారతానికి ..కలియుగ అంతానికి ..కల్కి అవతారానికి ఉన్న లింకును జనాలకు అర్థమయ్యే విధంగా తెరకెక్కించాడు డైరెక్టర్ నాగ్ అశ్వీన్.

ఈ సినిమాకి హైలెట్ పాయింట్ ఏంటి అంటే కచ్చితంగా విజువల్ ఎఫెక్ట్స్ అనే చెప్పాలి. స్టార్స్ తమదైన స్టైల్ లో నటించినా.. కొన్ని కొన్ని గ్రాఫిక్స్ సీన్స్ అద్దిరిపోయే రేంజ్ లో ఉన్నాయి అంటూ పొగిడేస్తున్నారు . ఫస్ట్ నుంచి ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ ఉండడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు. సామాన్య జనాలు కూడా ఈ సినిమాను చూసి బాగా లైక్ చేశారు . అశ్విని దత్ 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు దాదాపు 180 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబడినట్లు తెలుస్తుంది . ఇప్పటివరకు ఇంత హైయెస్ట్ రేంజ్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన అతి పెద్ద భారతీయ మూడవ సినిమాగా చరిత్ర సృష్టించింది కల్కి .

రాజమౌళి తెరకెక్కించిన ట్రిపులర్ మూవీ మొదటి రోజు దాదాపు 223 కోట్లు కలెక్షన్స్ కలెక్ట్ చేసి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఫస్ట్ ఇండియన్ ఓపెనర్ సినిమాగా మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఆ తర్వాత బాహుబలి 217 కోట్లకు పైగా వసూలు చేసి రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి వచ్చేసాడు కల్కి .దాపు 180 కోట్లతో ఇండియన్ బిగ్గెస్ట్ ఓపెనర్ మూడవ సినిమాగా రికార్డ్ సృష్టించింది . దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు . ఈ క్రేజీ రికార్డ్స్ బద్దలు కొట్టాలి అంటే ఇప్పట్లో ఏ హీరో తరం కాదు అంటూ తమ హీరోని ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news