Moviesబాలయ్య బర్త డే స్పెషల్: ఆయన కెరీర్ లో 400రోజులు ఒక్కే...

బాలయ్య బర్త డే స్పెషల్: ఆయన కెరీర్ లో 400రోజులు ఒక్కే ధియేటర్లో ఆడిన సినిమా ఇదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసింహం గా పాపులారిటీ సంపాదించుకున్న బాలకృష్ణ పుట్టినరోజు నేడు . ఈ క్రమంలోనే బాలకృష్ణకు సోషల్ మీడియా వేదికగా పలువురు స్టార్స్ ఫాన్స్ అభిమానులు శ్రేయోభిలాషులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు . అంతేకాదు బాలకృష్ణ ఎప్పుడు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి అని దీవిస్తున్నారు . కాగా బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ వైరల్ చేస్తున్నారు నందమూరి అభిమానులు .

ఈ క్రమంలోనే ఆయన కెరియర్ లో నటించిన ఒక సినిమా ఏకంగా థియేటర్లో 400 రోజులు ఆడిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ ఒక సినిమా మాత్రం థియేటర్స్ లో ఏకంగా 400 రోజులకు పైగా ఆడింది . ఆ సినిమా మరేదో కాదు లెజెండ్. యస్ ఈ సినిమాలో బాలయ్య పెర్ఫార్మన్స్ ఎంత హైలెట్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికీ టీవీలో వస్తే ఈ సినిమాని బాగా చూసి ఎంజాయ్ చేస్తారు అభిమానులు .

ఈ సినిమాలో ఆయన పర్ఫామెన్స్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఈ సినిమా ఆయన కెరీర్ కు బిగ్ బ్లాక్ బస్టర్ గా మారింది. గతంలో సమరసింహారెడ్డి ..నరసింహనాయుడు సినిమాలు ఎలాంటి హిట్ అందుకున్నాయో.. లెజెండ్ అందుకు పదిరెట్లు ఎక్కువ హిట్ అందుకుంది. ఈ సినిమా ఒక థియేటర్లో ఏకంగా 400 రోజులకు పైగా ఆడిన విషయాన్ని బాగా ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. త్వరలో బాబీ డైరెక్షన్ లో చేస్తున్న మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో మరో 100కోట్ల హిట్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు బాలయ్య..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news