అందరూ అనుకుంటూ ఉంటారు .. బాలయ్య అంటే కోపం ఎక్కువ .. ఏ విషయం అయినా ముక్కుసూటిగా చెప్తాడు .. ఆయనతో వేగడం కష్టం ..ఇలాంటి డైలాగ్స్ .. కానీ బాలయ్యలో ఎవరికీ తెలియని మర్యాద కూడా ఉంది . అభిమానులు అంటే చాలా రెస్పెక్టివ్ గా ఉంటాడు . ప్రాణం ఇచ్చేస్తాడు . ఆ విషయం నందమూరి అభిమానులకి బాగా తెలుసు . ఆయన గురించి తెలియని వాళ్ళే ఆయనను ట్రోల్ చేస్తూ ఉంటారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో బాలయ్య కు సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ గా మారింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట సింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య తన అభిమానులు తనను కలవడానికి వస్తే ఎంతలా రెస్పెక్ట్ ఇస్తాడు అన్న విషయం అందరికీ తెలుసు. రీసెంట్గా అలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు బాలయ్య లోని మంచి మనసుని చాలా మంది పొగిడేస్తున్నారు. మనకు తెలిసిందే.. నందమూరి బాలయ్య ప్రసెంట్ బాబీ దర్శకత్వంలో తెరకెకుతున్న ఒక సినిమా సెట్స్ లో బిజీగా ఉన్నాడు .
అక్కడికి బాలయ్య అభిమాని సజ్జాద్ తన కుమారుడితో కలిసి షూటింగ్ వద్దకు వచ్చారు. నటుడు బాలయ్యను కలవాలి అని రిక్వెస్ట్ చేశారు . ఆ విషయం బాలయ్యకు సమాచారం ఇచ్చారు . దీంతో వెంటనే ఆయన ఓకే చెప్పడమే కాదు అభిమానితో కలిసి ఆప్యాయంగా మాట్లాడి భోజనం కూడా చేశారు. కుమారుడి పేరు గురించి తెలుసుకొని బాగా చదివించి పెద్దవాడిని చేసి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగత తీర్చిదిద్దాలి అని సూచించారు . ప్రజెంట్ దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ బాగా ట్రెండింగ్ లోకి రావడంతో ..బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..!!