Moviesరాజమౌళి మహాభారతంలో "అర్జునుడు-కర్ణుడు-ధర్మరాజు-కృష్ణుడు" పాత్రలో నటించబోయేది ఏవరో తెలుసా..? రొమాలు నిక్కబొడుచుకోవాల్సిందే..!

రాజమౌళి మహాభారతంలో “అర్జునుడు-కర్ణుడు-ధర్మరాజు-కృష్ణుడు” పాత్రలో నటించబోయేది ఏవరో తెలుసా..? రొమాలు నిక్కబొడుచుకోవాల్సిందే..!

రాజమౌళి దర్శకత్వంలో ఏదైనా సినిమా తెరకెక్కుతుంది అంటే ఫ్యాన్స్ ఏ రేంజ్ లో వెయిట్ చేస్తారో మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు అందరి కళ్ళు మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా పైనే ఉన్నాయి . ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు. కానీ సినిమాపై మాత్రం హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు ఫ్యాన్స్ . మరి ముఖ్యంగా ఈ క్రమంలోనే రాజమౌళి ఎన్టీఆర్ కు సంబంధించిన మరొక వార్త వైరల్ గా మారింది . త్వరలోనే జక్కన్న మహాభారతం సినిమా తెరకెక్కించబోతున్నాడు అన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో అర్జునుడు – కర్ణుడు – ధర్మరాజు- కృష్ణుడు పాత్రలు చేసే ఒక హీరో పేరు మారుమ్రోగిపోతుంది . జక్కన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మహాభారతం తెరకెక్కిస్తాను అంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన కెరియర్లో ఇదే లాస్ట్ చిత్రంగా భావిస్తున్నాడు అని కూడా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. కాగా తాజాగా సోషల్ మీడియాలో మహాభారతం కి సంబంధించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో శ్రీకృష్ణుడు క్యారెక్టర్ ని ఏ హీరోకి ఇస్తే బాగుంటుంది అంటూ తారక్ ను ప్రశ్నించగా.. ఎవరో ఎందుకు..? తనే అంటూ తెలుపుతాడు ఎన్టీఆర్ . దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . అంతేకాదు అర్జునుడు – కర్ణుడు – ధర్మరాజు పాత్రలు కూడా తానే చేస్తానని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్ . ఇక ద్రౌపతి పాత్రను అలియా భట్ కు ఇస్తానని చెప్పాడు. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మరోసారి మారుమ్రోగిపోతుంది. వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. మరొకసారి అదే కాంబో రిపీట్ అయితే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్లాస్ట్ అవ్వాల్సిందే అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news