Moviesమీరు ""కల్కి సినిమాకి వెళ్తున్నారా ..? అయితే కచ్చితంగా ఇవి తీసుకెళ్లండి.....

మీరు “”కల్కి సినిమాకి వెళ్తున్నారా ..? అయితే కచ్చితంగా ఇవి తీసుకెళ్లండి.. మర్చిపోవద్దు..!

సాధారణంగా సరే ఏ అభిమానికైనా తమ ఫేవరెట్ హీరో హిట్ కొడితే ఆ ఆనందం అసలు వర్ణించలేనిది.. స్పెషల్ ఫీలింగ్ .. 100 వరల్డ్ కప్ లు ఒకేసారి అందుకున్న కిక్ వస్తుంది . ప్రెసెంట్ అలాంటి కిక్ నే ఎంజాయ్ చేస్తున్నారు రెబెల్ అభిమానులు . నిజం చెప్పాలి అంటే బాహుబలి సినిమా తర్వాత అలాంటి ఒక ఫుల్ మీల్స్ సినిమా ప్రభాస్ దగ్గర నుంచి వచ్చిందే లేదు . ఆఫ్ కోర్స్ సలార్ సినిమా హిట్ అయింది . కానీ అదంతా ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకునింది . కానీ బాహుబలి టైపులో ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు మారు మ్రోగిపోయేలా చేసిన సినిమా మాత్రం కల్కి అని చెప్పుకోక తప్పదు.

కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . నాగ్ అశ్వీన్ విజువలైజేషన్ కి ఫుల్ ఫిదా అయిపోయారు రెబల్ అభిమానులు. అంతేకాదు ఈ సినిమాలో ఆయన ఇంట్రడక్షన్ సీన్ హైలెట్గా మారింది అంటూ చెప్పుకొస్తున్నారు . బుజ్జిని ఇంట్రడ్యూస్ చేసే క్రమంలో ఆయన చెప్పే నాటి డైలాగ్స్ బాడీ మోడ్యూలైజేషన్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి అని ప్రభాస్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టేసాడు నాగ్ అశ్వీన్ అని ఓ రేంజ్ లో పొగుడుతున్నారు .

ఇదే క్రమంలో సినిమా చూసిన రెబల్ అభిమానులు పక్క షో కి సినిమాకి వెళ్లే ఫ్యాన్స్ కు సజెషన్స్ ఇస్తున్నారు. సినిమాలో ప్రతి సీన్ మూమెంట్లో అరిచి అరిచి గొంతు ఎండి పోతుంది అని ఖచ్చితంగా వాటర్ బాటిల్ క్యారీ చేయాలి అని.. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం బ్యాగ్స్ నిండా పేపర్స్ ఎత్తుకెళ్లాలని ..ఆ అరుపులు ఆ ఎంజాయ్మెంట్ మూమెంట్స్ మిస్ అవ్వదు అని.. ప్రభాస్ ఎంట్రీ సీన్ అప్పుడు ఇంటర్వెల్ ట్విస్ట్ అప్పుడు అలా అరుస్తూ పేపర్స్ ఎగరేస్తే వచ్చే ఎంజాయ్మెంట్ వేరే లెవెల్ లో ఉంటుంది అని సినిమాను మరొక మెట్టు ఎక్కించేశాడు ప్రభాస్ అంటూ ఓ రేంజ్ లో పోగిడేస్తున్నారు . దీనికి సంబంధించిన ట్వీట్స్ పోస్టులు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news