Moviesపవన్ గెలుపు పై అలాంటి కామెంట్స్ చేసిన అనసూయ..భలే విచిత్రంగా ఉందే(వీడియో)..!?

పవన్ గెలుపు పై అలాంటి కామెంట్స్ చేసిన అనసూయ..భలే విచిత్రంగా ఉందే(వీడియో)..!?

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు . అది సాఫ్ట్వేర్ రంగం కాదు.. వేరే ఫీల్డ్ కాదు .. రాజకీయ నాయకులు కాదు.. సినిమా స్టార్స్ కాదు .. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే పర్సన్స్ కాదు … ఎవరైనా సరే అందరూ మాట్లాడుకునే ఒకే ఒక్క టాపిక్ పవన్ కళ్యాణ్. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి మారి తనదైన స్టైల్ లో ఏపీ కూటమిను విజయం దిశగా ముందుకు తీసుకెళ్లి మరికొద్ది రోజుల్లోనే కూటమి అధికారం చేపట్టబోయే విధంగా చేశాడు పవన్.

ఒకే ఒక్క దెబ్బతో పవన్ కళ్యాణ్ పేరు మారుమ్రోగిపోతుంది . అఫ్ కోర్స్ అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ పేరును బాగా ట్రెండ్ చేసేవాళ్ళు .. కానీ మూడు పెళ్లిళ్లు అంటూ ట్రోలింగ్ కూడా చేసేవారు. ఇప్పుడు ఆ మూడు పెళ్లిలు విషయాన్ని మర్చిపోయారు . కేవలం పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటూ పిలవడమే పనిగా పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడంతో మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చిన విషయం తెలిసిందే . దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

కాగా ఈ వీడియో జనాలు పాజిటివ్గా రిప్లై ఇస్తున్నారు . అన్నదమ్ముల మధ్య ఉన్న బంధాన్ని తెగ పొగిడేస్తున్నారు . ఈ వీడియో పై అనసూయ కూడా క్రేజీ కామెంట్స్ చేసింది . ఆ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ..”ఇది ఆరంభం మాత్రమే.. వచ్చాడు మా నాయకుడు ..వచ్చాడు ..పవర్ లో పవర్ స్టార్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది . ఇదే నిజమైన ప్రేమ అంటూ చిరు పవన్ మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఒక పోస్ట్ చేసింది”. ప్రస్తుతం అనసూయ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది . దీంతో పలువురు అనసూయని కూడా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడు అనసూయ అంటే పడని జనాలు నెగటివ్ గానే ట్రోల్ చేస్తున్నారు . అయితే సడన్గా పవన్ కళ్యాణ్ పై అనసూయ ఇలాంటి ప్రేమ కురిపిస్తూ పోస్ట్ చేయడం ఏంటి..? అంటూ పలువురు ద్వంద అర్థాలతో ఆమెను ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news