Moviesబిగ్ బాస్ చరిత్రలోనే కనీ విని ఎరుగని మార్పు.. ఆమెను హౌస్...

బిగ్ బాస్ చరిత్రలోనే కనీ విని ఎరుగని మార్పు.. ఆమెను హౌస్ లోకి పంపించడానికి స్టార్ మా ఇంతకు తెగించేసిందా..?

బిగ్ బాస్ .. ఈ పేరు చెప్తే తిట్టుకునే జనాలు సగం మంది.. పొగిడే జనాలు మరి కొంతమంది .. బిగ్ బాస్ కొందరు లైఫ్లను బాగుపరిచింది. మరికొందరి జీవితాల్ని చిందర వందర చేసేసింది . ఆ విషయం అందరికీ తెలిసిందే . కాగా ఇప్పటికే సక్సెస్ఫుల్గా ఏడు సీజన్ లను కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ త్వరలోనే ఎనిమిదవ సీజన్ ని స్టార్ట్ చేయబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది . హౌస్ లోకి ఎవరు వెళ్లాలి ..? ఏ కంటెస్టెంట్స్ వెళ్లాలి..? అన్న విషయం కూడా కన్ఫామ్ అయిపోయినట్లు సోషల్ మీడియాలో తెలుస్తుంది .

ఈసారి అల్లాటప్ప కాండిడేట్స్ కాకుండా చాలా తోపైన కాండిడేట్స్ ని పంపించాలి అంటూ బిగ్ బాస్ నిర్ణయం తీసుకుందట . అంతేకాదు ఈసారి స్టార్ మా ప్రత్యేకంగా బిగ్ బాస్ పై కాన్సన్ట్రేషన్ చేస్తుందట . బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తున్న దీపికా రంగరాజును ఎలాగైనా సరే బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడానికి స్టార్ మా బాగా ప్రయత్నాలు చేస్తుందట . బ్రహ్మముడి సీరియల్ హిట్ అయింది అంటే దానికి ఏకైక కారణం దీపికా రంగరాజు .

అయితే దీపికా రంగరాజు మాత్రం ఎక్కడా కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్లు ప్రకటించలేదు. అంతేకాదు దీపికా రంగరాజు చాలా చాలా యాక్టివ్ .. నాటి.. ఏ షో కి వెళ్ళినా సరే ఆ షో కి హ్యుజ్ టిఆర్పి రేటింగ్స్ తీసుకొస్తుంది. అలాంటి దీపికా రంగరాజును బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తే ఖచ్చితంగా ట్రోఫీ ఆమెదే అంటున్నారు అభిమానులు . అయితే దీపికా రంగరాజు మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి అంత ఇష్టంగా లేదట . కానీ స్టార్ మా మాత్రం భార్య ఆఫర్తో ఆమెను లోపలికి పంపించడానికి సిద్ధంగా ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది . సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో ..దీపికా రంగరాజు స్టార్ మా ఇచ్చిన ఆఫర్ కి అట్రాక్ట్ అయ్యి..లోపలికి వెళ్తుందో..? లేకపోతే తన పని తాను చూసుకుంటూ సీరియల్స్ చేసుకుంటుందో..??

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news