Moviesఈ ఇద్దరి హీరోలలో..కల్కి రికార్డ్స్ బీట్ చేసే సత్తా ఎవరికి ఉంది..?...

ఈ ఇద్దరి హీరోలలో..కల్కి రికార్డ్స్ బీట్ చేసే సత్తా ఎవరికి ఉంది..? ఫ్యాన్స్ పెంట పెంట చేస్తున్నారే..!

సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే విధంగా చర్చించుకుంటున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా కల్కి . ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో ప్రభాస్ అందరికీ తెలిసిందే . నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై హ్యూజ్ ఫ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ముందు నుంచే ఉన్నాయి . ఆ ఎక్స్పెక్టేషన్స్ ను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాడు నాగ్ అశ్వీన్.

కాగా నాగ్ అశ్వీన్.. దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తుంది. మొదటి రోజే 180 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండవ రోజు కూడా అదే స్థాయిలో తన సక్సెస్ను ముందుకు తీసుకెళ్తుంది . ఎన్నో ఎన్నో రికార్డ్స్ సైతం నెలకొల్పింది కల్కి మూవీ . ఈ క్రమంలోనే కల్కి రికార్డ్స్ బీట్ చేసే సత్తా నెక్స్ట్ ఏ హీరోకి ఉంది అనే విషయం హైలైట్ గా మారింది . కల్కి సినిమా రికార్డ్స్ బిట్స్ చేసే సత్తా దేవర సినిమాకి ఉంది అంటూ చెబుతున్నారు నందమూరి అభిమానులు .

సెప్టెంబర్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు . అయితే ఈ సినిమాకి అంత సీన్ లేదు అంటూ కొంతమంది తేల్చేస్తున్నారు. ఇది నార్మల్ కాన్సెప్టెడ్ సినిమా అని .. ఇది కల్కి సినిమా రికార్డ్స్ బీట్ చేసే అంతస్థాయి లేదు అని చెప్పుకొస్తున్నారు. మరొక పక్క బన్నీ ఫ్యాన్స్ పుష్ప2 అ రికార్డ్స్ బీట్ చేస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు. పుష్ప 2 తో గ్లోబల్ స్ధాయిలో గుర్తింపు సంపాదించుకోబోతున్న బన్నీ.. కల్కి రికార్డును తుక్కుతుక్కు చేస్తాడు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . మరి మీరేమనుకుంటున్నారు .. ఆ రికార్డ్స్ బీట్ చేసే సత్తా ఎవరికి ఉంది..? జూనియర్ ఎన్టీఆర్ కా..? బన్ని కా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news