Moviesఅయ్యయ్యో పాపం.."కల్కి" సినిమా ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేసినా.. ఆ...

అయ్యయ్యో పాపం..”కల్కి” సినిమా ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేసినా.. ఆ ఇద్దరి హీరోల రికార్డు మాత్రం టచ్ చేయలేకపోయిందిగా..!

సోషల్ మీడియాలో నెగెటివిటీ పెంచేసే జనాలు ఎక్కువగానే ఉంటారు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఏ స్టార్ సెలబ్రెటీ నటించిన సినిమా రిలీజ్ అయిన క్రేజీ రికార్డ్స్ నెలకొల్పిన తమ ఫేవరెట్ హీరో సినిమానే తోపు అంటూ డప్పులు కొట్టుకుంటూ ఉంటారు . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తున్నాం . తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో కల్కి సినిమా పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే.

మరి ముఖ్యంగా ప్రభాస్ నటించిన కల్కి సినిమాకి కర్త – కర్మ – క్రియ మొత్తం కూడా నాగ్ అశ్వీన్ నే అంటూ ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపిస్తున్నారు . అఫ్కోర్స్ సినిమా సక్సెస్ లో 50% ఆయనకే క్రెడిట్ చెందుతుంది చాలా అద్భుతంగా తెరకెక్కించారు . కానీ కాస్తో కూస్తో అలాంటి రోల్ లో నటించిన ప్రభాస్ కి సైతం ఆ క్రేజ్ దక్కాల్సిందే . కాగా ఈ సినిమా మొదటి రోజు దాదాపు 180 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . ఇప్పటివరకు ఇండియన్ సినిమా చరిత్రలోనే అతి పెద్ద ఓపెనర్ కలెక్షన్స్ సాధించిన మూడవ సినిమాగా కల్కి సినిమా చరిత్ర సృష్టించింది . దీంతో ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

అయితే ఆ ఫ్యాన్స్ ఆనందాన్ని కాసేపు కూడా ఎంజాయ్ చేయనివ్వడం లేదు కొందరు ఆకతాయిలు . ప్రభాస్ సినిమా 180 కోట్లు కలెక్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా రికార్డును టచ్ చేయలేకపోయాడు . రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా మొదటిరోజు 223 కోట్ల కలెక్షన్స్ సాధించి ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మొదటి ఓపెనర్ మూవీగా నెం 1 స్థానంలో కొనసాగుతుంది. అయితే ప్రభాస్ నటించిన కల్కి మాత్రమే 180 కోట్లతో సరిపెట్టుకుంది . ఈ విధంగా చూసుకుంటే పాన్ ఇండియా స్టార్ అని చెబుతున్న ప్రభాస్ ..ఎన్టీఆర్ – తారక్ రికార్డును టచ్ చేయలేకపోయాడు అంటూ ఫ్యాన్స్ మండిపోయే రేంజ్ లో కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళకి ధీటుగా రెబల్ ఫ్యాన్స్ కూడా కౌంటర్స్ వేస్తూ ఉండడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news