Movies"ఎన్టీఆర్ తరువాత ఇండస్ట్రీలో ఆ దమ్మున మగాడు ఆయన ఒక్కడే".. నరేష్...

“ఎన్టీఆర్ తరువాత ఇండస్ట్రీలో ఆ దమ్మున మగాడు ఆయన ఒక్కడే”.. నరేష్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏ స్టార్ సెలబ్రిటీ ఏం మాట్లాడినా అది పెద్ద రాద్ధాంతంగా మారిపోతుంది . ఒక వర్గం ప్రజలు పాజిటివ్ గా ఆలోచిస్తుంటే మరొక వర్గం ప్రజలు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు . తాజాగా సీనియర్ నటుడు నరేష్ సంచలన కామెంట్స్ చేశారు . ఎన్నో ఎన్నో మంచి క్యారెక్టర్లలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన ..రీసెంట్ కాలంలో సోషల్ మీడియాలో ఎలా ట్రెండ్ ట్రోలింగ్కి గురయ్యారో మనకు తెలిసిందే. కాగా ఇటీవల ఏపీ ఎన్నికల టైం లో ఆయన పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశారు ..ట్వీట్ కూడా చేశారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు . పవన్ కళ్యాణ్ ఓ డైనమిక్ పర్సన్ అని అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి అని చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేశారు. నరేష్ మాట్లాడుతూ..” ఫ్రాంక్ గా మాట్లాడే వాళ్ళు ..ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవాళ్లు అంటే నాకు చాలా ఇష్టం .. బోల్డ్ గా డైనమిక్ గా మనసుతో మాట్లాడాలి .. అలాంటి వాళ్ళని నేను ఎక్కువగా లైక్ చేస్తాను .. చెన్నైలో నేను పవన్ కళ్యాణ్ పక్కపక్కనే ఉండేవాళ్లం.. అప్పటి నుంచే మాకు బాగా పరిచయం ..ప్రతి ఫంక్షన్లో కలిసే వాళ్లం.. చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేవాళ్ళం”..

” ఏమీ లేనప్పుడే పీపుల్ ఆర్మీ అని పెట్టి కొన్ని కోట్లు ఇచ్చారు ..చేతుల్లో అధికారం వస్తే ప్రజల కోసం ఏం చేస్తారో ఆలోచించండి ..ఆయనలో ప్రజలకు సేవ చేయాలి అన్న కసి ఉంది.. ఎన్టీ రామారావు గారి తర్వాత అలాంటి దమ్మున్న నటుడు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ నే.. ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ వెళ్ళిపోకుండా పారిపోకుండా నిలబడి ముందుకు వెళ్లి వారాహితో జనాల మనసులను గెలుచుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ ..ఇది మామూలు పోరాటం కాదు “అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు నరేష్ . ప్రెసెంట్ ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊపు తెప్పిస్తున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news