Moviesఅద్గది ప్రభాస్ అంటే.. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం "కల్కి" సినిమా...

అద్గది ప్రభాస్ అంటే.. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం “కల్కి” సినిమా మొదటి రోజు ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుందో తెలుసా..?

ప్రభాస్.. సినిమా అంటే మినిమం కలెక్షన్స్ గ్యారెంటీ . బాహుబలి సినిమా తర్వాత ఆయన రేంజ్ కూడా మారిపోయింది . ప్రభాస్ సినిమా అంటే కచ్చితంగా ఆ మూవీ 100 కోట్లు దాటేయాల్సిందే ..కొన్ని కొన్ని సార్లు ఆ కౌంట్ పెరిగిన కూడా ఆశ్చర్యపోనవసరం లేదు . ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో అభిమానులకి ఓ న్యూస్ గూస్ బంప్స్ తెప్పించేలా చేస్తుంది. మనకు తెలిసిందే మరి కొద్ది గంటల్లోనే ప్రభాస్ నటించిన కల్కి సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది .

నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు. అయితే ఈ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది . ఫాన్స్ రకరకాలుగా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉండటం గమనార్హం. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ట్రేడ్ వర్గాలు ఈ సినిమా మొదటిరోజు దాదాపు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసే ప్రభావం ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు.

కొత్త కాన్సెప్ట్ కావడం ..పైగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కడం అంతే రేంజ్ లో జనాలు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉండడం సినిమాకి హైలెట్గా మారిపోయింది అని .. కచ్చితంగా ప్రభాస్ నటించిన ఈ సినిమా మొదటిరోజు 100 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి సినిమా ఇండస్ట్రీ చరిత్ర తిరగరాస్తుందని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . ట్రేడ్ వర్గాలు కూడా అదే విధంగా లెక్కలు వేస్తూ ఉండడం గమనార్హం . చూద్దాం మరి ప్రభాస్ తన సినిమాతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతున్నాడో..??

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news