ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలోనే కనీ విని ఎరుగని కొత్త రూల్ ని తీసుకొచ్చినట్లు ఓ వార్త ట్రెండ్ అవుతుంది. ఏ సీజన్లోనూ ఏ లాంగ్వేజ్ లోనూ ఇలాంటి రూల్ తీసుకురాలేదు . కేవలం తెలుగు బిగ్ బాస్ లోనే తీసుకొచ్చారు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . మనకు తెలిసిందే బిగ్ బాస్ సక్సెస్ఫుల్గా ఏడు సీజన్లూ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే ఎనిమిదవ సీజన్ ప్రారంభం కాబోతుంది . ఎప్పటిలాగే బిగ్ బాస్ పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు జనాలు.
ఎప్పుడెప్పుడు ఈ షో స్టార్ట్ అవుతుందా..? అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . ఇప్పటికే హౌస్ లోకి వెళ్లాల్సిన కంటెస్టెంట్ల లిస్ట్ ఫైనలైజ్ అయిపోయిందట . త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుందట .అంతేకాదు ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జున నే చేయబోతున్నాడు అన్న వార్త బాగా వైరల్ గా మారింది . అయితే ఎప్పుడు లా కాకుండా ఈసారి బిగ్ బాస్ కొత్త రూల్ ని తీసుకొచ్చిందట. బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ తర్వాత ఆ కంటెస్టెంట్ బయటకు పంపియకుండా రెండు వారాలపాటు హౌస్ లోనే పెట్టి సీక్రెట్ రూమ్ లో దాచి ..
ఆ తర్వాత ఆ వీక్ లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అనే విషయం తెలిసి వాళ్ళ చేత వరస్ట్ కంటెస్టెంట్ ను బయటకు పంపించి ఎలిమినేట్ అయిన టాప్ 2 కంటెస్టెంట్లలో ఒకరిని మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించాలి అంటూ నిర్ణయం తీసుకున్నారట . ఇలా చేయడం వల్ల షో మరింత రసవత్తరంగా మరి కాంట్రవర్షల్ గా మారి టీఆర్పీస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయట . ఆ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారట బిగ్బాస్ మేనేజ్మెంట్. దీంతో ఈసారి షో మరింత హాట్ హాట్ గా ఉండబోతుంది అంటున్నారు అభిమానులు . చూద్దాం బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సక్సెస్ అవుతుందో..??