Moviesవావ్: ఇది నిజంగా కెవ్వు కేక..అద్దిరిపోయే ఆఫర్ ప్రకటించిన సమంత..డోంట్ మిస్..!!

వావ్: ఇది నిజంగా కెవ్వు కేక..అద్దిరిపోయే ఆఫర్ ప్రకటించిన సమంత..డోంట్ మిస్..!!

సమంత .. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ పెళ్లికి ముందు వరకు ఇండస్ట్రీని ఓ రేంజ్ లో అల్లాడించేసింది . పెళ్లి తర్వాత తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది . విడాకులు తర్వాత మాత్రం సోషల్ మీడియాని సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తుంది. సమంత గురించి చెప్పుకోవాలి అంటే ఇలాంటి ఇంట్రడక్షన్ ఏ అవసరం . కాగా దాదాపు అగ్ర హీరోలతో అందరితో నటించిన ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేసిన విషయం తెలిసిందే .

ఆ తర్వాత రేర్ డిసీజ్ మయోసైటిస్ అనే వ్యాధికి కూడా గురైంది . ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంటూ బయటపడుతుంది . కాగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న సమంత ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తుంది అంటూ తెలుస్తుంది. ఎర్ర చీర కట్టుకొని చేతిలో తుపాకీ పట్టుకొని వీరనారి గెటప్ లో దర్శనం ఇవ్వడం ఫాన్స్ కి ఒక్కసారిగా పూనకాలు వచ్చేశాయి . తాజాగా సమంత ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఒక పోస్ట్ షేర్ చేసింది .

ఆ పోస్ట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఫాన్స్ కు భారీ గుడ్ న్యూస్ అంటూ పోస్ట్ షేర్ చేసింది. “సాఖీ పేరుతో సమంత గార్మెంట్ బ్రాండ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కంపెనీలో పని చేసేందుకు ఉద్యోగ ప్రకటన చేసింది . తగు అర్హత ఉన్నవారు కింద ఇచ్చిన మెయిల్ అడ్రస్ కు వివరాలు పంపాలని తెలిపింది. ఫ్యాషన్ డిజైనర్.. మేనేజర్ అసిస్టెంట్.. మేనేజర్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ బ్రాండ్ మార్కెటింగ్ తో పాటు మరో రెండు పొజిషన్స్ కూడా ఉన్నాయి అంటూ సామ్ వెల్లడించింది . ఈ వార్త విన్న సమంత ఫ్యాన్స్ ఆ గోల్డెన్ ఆఫర్ మాకే రావాలి అంటూ తెగ తెగ ట్రై చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news